సుధీర్ బాబు మూవీలో చైతూ, రానా గెస్ట్ రోల్

By Bojja Kumar

హైదరాబాద్: "ప్రేమకథా చిత్రమ్" సినిమాతో హిట్ ఫెయిర్ అనిపించుకున్న సుధీర్ బాబు, నందిత జంటగా నటిస్తున్న చిత్రం "కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ". ఈ మూవీ కన్నడ రీమేక్. కన్నడ హిట్ మూవీ "చార్మినార్" ఆధారంగా రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ నిర్మించే ఈ చిత్రానికి కన్నడ డైరెక్టర్ చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో నాగ చైతన్య, దగ్గుబాటి రానా గోస్ట్ రోల్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని తొలుత నాగ చైతన్యతో చేయాలనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో సుధీర్ బాబు చేతికి వెళ్లింది. తన చేజారిన సినిమాలోనే నాగ చైతన్య గెస్ట్ రోల్ చేస్తుండటం గమనార్హం.

Naga Chaitanya cameo 'KKI'

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగించుకొని, నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమా ఆడియో ఈనెల(జనవరి) 21న ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూస్తుంటే ఈ సినిమాను చంద్రు అందమైన, మధురమైన ప్రేమ కావ్యంలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి హరి సంగీతాన్ని అందించారు.

ఆదిత్య మ్యూజిక్ వారు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ప్రోమో సాంగ్స్ విడుదల చేయగా సంగీత ప్రియులని అలరిస్తున్నాయి. ఈ సినిమాలో గిరిబాబు, ఎం.ఎస్.నారాయణ, కిషోర్ దాస్, ప్రగతి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X