సవ్యసాచి అంటే తెలియదు..నిజంగానే ఇలా జరుగుతుందా, గూగుల్‌లో వెతికా.. నాగ చైతన్య!
అక్కినేని నాగ చైతన్య, విభిన్న చిత్రాల దర్శకుడు చందు ముండేటి దర్శత్వంలో వస్తున్న చిత్రం తాజా చిత్రం సవ్యసాచి. ట్విన్ సిండ్రోమ్ అనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్, టీజర్ తో ఆసక్తి పెంచేసింది.నవంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే చందూ ముండేటి, చైతు కాంబోలో ప్రేమమ్ చిత్రం వచ్చింది. దీనితో సవ్యాచి చిత్రంపై ఆసక్తి నెలకొని ఉంది. ఓ ఇంటర్వ్యూలో చైతు ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

పేపర్‌లో చూసి
ఓ సందర్భంలో పేపర్ లో చూసిన ఆర్టికల్ చదివానని చందు ముండేటి తెలిపారు. ఆ విషయం గురించి లోతుగా పరిశీలించా. చాలా ఆసక్తికరమైన పాయింట్స్ తెలిశాయి. ఆ విధంగా సవ్యసాచి కథ సిద్ధం చేశానని దర్శకుడు చందు ముండేటి తెలిపారు.

సవ్యసాచి అంటే తెలియదు
హీరోకి రెండు చేతుల్లో బలం ఉంటుంది కాబట్టి.. సవ్యసాచి అనే టైటిల్ పెట్టాం అని చందూ ముండేటి తెలిపారు. నాగ చైతన్య మాట్లాడుతూ.. సవ్యసాచి అనే గతంలో విన్నా. కానీ దాని దానిగురించి పూర్తిగా తెలియదు. అలాగే ట్విన్ సిండ్రోమ్ గురించి అసలు తెలియదు. చందూ ఈ చిత్రం గురించి చెప్పగానే గూగుల్, యూట్యూబ్ లో ఈ విషయాల గురించి వెతికానని చైతు తెలిపాడు.

చాలా సంఘటనలు
సవ్యసాచి చిత్రంలో చూపించిన ట్విన్ సిండ్రోమ్ సంఘటనలు ప్రపంచంలో చాలా జరిగాయి. వాటి గురించి కొన్ని ఆర్టికల్స్ చదివి ఆశ్చర్యపోయినట్లు నాగ చైతన్య తెలిపాడు. ఇలా కూడా జరుగుతుందా అని చందూని అడిగానని చైతు తెలిపాడు.

మాధవన్ ఒప్పుకోవడంతోనే
ఈ చిత్రంలో విలన్ పాత్రలో మాధవన్ నటించారు. ఆయన చాలా గొప్పనటుడు అని చైతు ప్రశంసించారు. ఇటీవల ఆయన నటించిన పాత్రలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఏ సినిమా పడితే ఆ సినిమాలో ఆయన నటించారు. కథల ఎంపికలో చాలా పరిణితి కనబరుస్తారు. అలాంటి వ్యక్తి సవ్యసాచి చిత్రాన్ని ఒకే చేయడంతో మా కథపై కాన్ఫిడెన్స్ పెరిగిందని చైతు తెలిపాడు.


Click it and Unblock the Notifications











