కంటెంట్ అలాంటిదే.. నాన్న ఫంక్షన్లకు రావాలంటే ఇబ్బందిగా ఉంటోంది: నాగ చైతన్య
అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం 'మన్మథుడు 2'. ఇందులో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు.
ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతుంది. దీనిని పురస్కరించుకుని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని నాగ చైతన్యం అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన సినిమా, తండ్రి నాగార్జునపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఫంక్షన్‌లో నాగ చైతన్య మాట్లాడుతూ.. 'నిజంగా చెప్పాలంటే ఈ మధ్య నాన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌కి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ముందేమో అందరూ మీరు బ్రదర్స్‌లా ఉన్నారని కామెంట్ చేసేవాళ్లు. సరే బ్రదర్సే కదా లుక్స్‌తో ఏదో మేనేజ్ చేయొచ్చులే అనిపించింది. కానీ, ఇప్పుడు కంటెంట్ కూడా అలాంటివే ఎంచుకుంటున్నారు నాన్న. ఇట్స్ రియల్లీ అమేజింగ్. మీ కెరీర్‌లో ఒక ప్రేమకథని ఫ్రెష్‌గా చూపిస్తున్నారంటే రియల్లీ అమేజింగ్' అని తండ్రి గురించి మాట్లాడాడు.
అలాగే 'మాకు ఒక్క హిట్ వస్తే అదే జోనర్‌లో మరో రెండు సినిమాలు సేఫ్‌గా చేద్దామనుకుంటాం.. ఫ్లాప్ వచ్చిందంటే ఇంకొంచెం జాగ్రత్తగా కథలు ఎంచుకోవాలనుకుంటాం. కానీ, నాన్నగారు అలాకాదు.. హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ప్రతి అడుగు ధైర్యంగా వేస్తారు.. అందుకే ఆయన 'కింగ్' అయ్యారు. అందుకే మాకు ఆయన చాలా స్ఫూర్తి. 'చి.ల.సౌ' చూడగానే అన్నపూర్ణలో రాహుల్‌తో ఓ సినిమా చేద్దామని నాన్నకు చెప్పాను.. తనతో త్వరలోనే పనిచేయాలనుకుంటున్నా' అని చైతూ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











