twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాతగారి ఇంకో పాటకి మళ్లీ నాగ చైతన్య

    By Srikanya
    |

    హైదరాబాద్ : మొన్నీ మధ్యే మనం చిత్రంలో నేను పుట్టాను లోకం నవ్వింది అంటూ తన తాతగారైన అక్కినేని నాగేశ్వరరావు గారి పాట రీమిక్స్ లో స్టెప్స్ వేసిన నాగ చైతన్య మరోసారి అలాంటి ఫీట్ చేయబోతున్నారు.

    నాగ చైతన్య తాజా చిత్రం 'ఒక లైలా కోసం' చిత్రంలో ఎఎన్నార్ పాట 'ఒక లైలా కోసం తిరిగాను దేశం..ప్రతి రోజు ప్రతీ రాత్రి ప్రతీ పాట ఆమె కోసం..లైలా ఏదని 'ని రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటలో నాగచైతన్య మోడ్రన్ స్టెప్ లతో అలరించనున్నారు. ఈ పాట రాముడు కాదు కృష్ణుడు అనే చిత్రంలోది.

    Naga Chaitanya dancing for ANR's song

    దర్శకుడు మాట్లాడుతూ... 'ఒక లైలా కోసం తిరిగాను దేశం' అన్నాడు ఆ కుర్రాడు. దీనికి ఆ అమ్మాయి ఊరుకుంటుందా.. వెంటనే 'ఒక మజ్నూ కోసం వెతికాను లోకం..' అంటూ సమాధానమిచ్చింది. ఇలాంటి ఓ ప్రేమజంట కథే మా సినిమా . ఓ అమ్మాయి ప్రేమని పొందడానికి అబ్బాయి చేసిన ప్రేమ పోరాటమే ఈ చిత్రం. సినిమా అంతా సందడిగా.. వినోదాత్మకంగా సాగుతుంది'' అంటున్నారు విజయ్‌కుమార్‌ కొండా. పూజా హెగ్డే కథానాయిక. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు.

    ప్రస్తుతం చిత్రం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో టీజర్‌ను, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బ్రహ్మానందం, అలీ, ప్రభు, నాజర్‌, ఆశిష్‌ విద్యార్థి, సుప్రీత్‌, మధు, ప్రగతి, సుధ, దీక్షా పంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కెమెరా: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, ఆర్ట్‌: పి.ఎస్‌.వర్మ, ఫైట్స్‌: విజయ్‌, కాస్ట్యూమ్స్‌: నీరజ కోన, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సాయిబాబా.

    English summary
    Naga Chaitanya will be dancing to the re-mix of late ANR's song 'Oka Laila Kosam' from ‘Ramudu Kaadu Krishnudu’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X