నాగచైతన్య, దేవాకట్టా కాంబినేషన్ పూర్తి డిటేల్స్
ప్రస్ధానం చిత్రంతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు దేవకట్టా. ఆయన తాజాగా ఆటోనగర్ సూర్య అనే చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోగా నాగచైతన్యను ఎంపిక చేసుకున్నారు. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి.
ఈ చిత్రం వివరాలు ఆయన మీడియాకు తెలియచేస్తూ...దేవాకట్టా మంచి కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న స్టయిలిష్ ఫిలిమ్ ఇది. హీరో క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగచైతన్యను పెద్దరేంజ్‌కి తీసుకువెళ్లే ప్రొటెన్షీయాలిటీ ఉన్న కథ ఇది. నిర్మాత వెంకట్‌కు కూడా ఈ కథ నచ్చడంతో చిత్రం నిర్మించడానికి పూనుకున్నాం. జూన్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. మిగతా వివరాలన్నీ త్వరలో తెలియజేస్తాం అని వివరించారు.
హీరో నాగచైతన్య మాట్లాడుతూ దేవాకట్టా చెప్పిన కథ చాలా బాగుంది. నా పాత్ర అద్భుతంగా మలచడానికి ఆయన ప్రయత్నిస్తుండడంతో నేను ఈ చిత్రానికి చేయడానికి పూనుకున్నాను. హీరోగా నాకు మంచి చిత్రం అవుతుంది, అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications











