'దడ' ప్రి రిలీజ్ టాక్ ఏంటి?
నాగచైతన్య తాజా చిత్రం 'దడ' ఈ రోజు విడుదల అవుతోంది. ఈ చిత్రం గురించి పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ప్రి రిలీజ్ టాక్ ప్రకారం యావరేజ్ అంటున్నారు. అయితే చి్త్రం మొత్తం హాలీవుడ్ సినిమాలా స్టైలిష్ గా తీసాడని దర్శకుడుని మెచ్చుకుంటున్నారు. స్టోరీ లైన్ బాగా దిన్ గా ఉండటంతో సెకెండాఫ్ లో కాస్త లాగ్ వచ్చిన పీలింగ్ ఉంటుందని, టోటల్ గా సినిమా బాగుందని చెప్తున్నారు. ఇక ఇంటర్వెల్ ట్విస్టు అయితే బాగా కుదిరిందని, పది రోజుల్లో జరిగే కథని రేసీగా నడిపాడని అంటున్నారు. నిర్మాణపరంగా చాలా రిచ్ గా ఉన్న ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్ మరింతగా పెంచి ఉండాల్సిందని చెప్తున్నారు. కామిడీ ఓ మాదిరిగా ఉన్నా,యాక్షన్ ఎపిసోడ్స్ లో నాగచైతన్య ఈజ్ చూపించాడని వినికిడి. మొదటి పదిహేను నిముషాలు అయితే సినిమాను ఎక్కడికో తీసుకెళ్థుందని అది మిస్ కావద్దని చెప్పుకుంటున్నారు. అయితే నాగచైతన్య హవా ముందు ఈ మైనస్ లు ఏమీ నిలబడవనేది నిజం. అలాగే సినిమా వాళ్ళ టాక్ కన్నా డబ్బు పెట్టి చూసే సామాన్య ప్రేక్షకులు టాక్ ముఖ్యం కాబట్టి సినిమా వారి టాక్ పై ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications











