సమంత, నాగచైతన్య విడాకులకు అది కారణం కాదా? శోభితతో ఎంగేజ్‌మెంట్ తర్వాత హాట్‌గా ఆ టాపిక్!
ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో ఉన్నటువంటి మూవీ లవర్స్ నుంచి పాన్ ఇండియా సినిమా వరకు వినిపిస్తున్న వార్త ఏదన్నా ఉంది అంటే అది అక్కినేని నవ నవయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లి కోసమే అని చెప్పాలి. ఇది వరకే స్టార్ హీరోయిన్ సమంతని పెళ్లి చేసుకున్న చైతు ఆమెతో విడాకులు అనంతరం ప్రముఖ టాలెంటెడ్ నటి శోభిత ధూళిపాళని పెళ్లి చేసుకోవడం కన్ఫర్మ్ అయ్యిపోయింది.
పైగా నాగార్జున తన కొడుకు కాబోయే కోడలితో కలిసి ఫోటో పెట్టి అందరికీ వార్త అయితే క్లియర్ చేసేసారు. ఈ క్రమంలో మరోసారి సోషల్ మీడియాలో సమంత, నాగ చైతన్యల విడాకులు సంబంధించి పలు కామెంట్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇద్దరూ ఎందుకు విడిపోయారు అనే అంశానికి కారణం వారి మధ్యలోనే ఉంది తప్పితే బయటకి ఎవరి సైడ్ నుంచి కూడా రాలేదు.

అయితే ఇప్పుడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ లపై ఎలాగైతే ఒకటి కాబోతున్నారని వార్తలు వచ్చాయో కొన్నాళ్ల కితం నాగ చైతన్య సమంత విడిపోవడానికి గల కారణాలు కూడా కొన్ని వైరల్ గా మారాయి. కాగా వీటిలో ముఖ్య కారణంగా సమంత పలు బోల్డ్ సిరీస్ లు ఓవర్ ఎక్స్ పోజింగ్ వంటివి చేయడం ఇంకా ముఖ్యంగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో ఆమె చేసిన కొన్ని షాకింగ్ బోల్డ్ సీన్స్ చైతూకి నచ్చకపోవడం వల్లే గొడవలు అయ్యి విడిపోయారు అని కొన్ని గాసిప్స్ ఉన్నాయి.
మరి అదే కారణం అయితే ఇప్పుడు ఖచ్చితంగా శోభిత ధూళిపాళని చైతూ పెళ్లి చేసుకొని ఉండే వాడు కాదు. ఎందుకంటే సమంత హై ప్రొఫైల్ కావడం మూలాన కొంచెం తక్కువ నిడివి ఉన్న బోల్డ్ సీన్స్ చేసినప్పటికీ బాగా పాపులర్ అయ్యింది. కానీ తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించిన శోభిత ధూళిపాళ అప్పటిలో మరీ అంత ఫేమ్ తెచ్చుకోలేదు కానీ ఆమెవి పలు ఓటిటి సిరీస్ లు ఐతే సమంత కంటే దారుణమైన బోల్డ్ సీన్స్ తో కూడినవి ఉన్నాయి.
బోల్డ్ అంటే మామూలు బోల్డ్ సీన్స్ కూడా కాదు అవి ఆ రేంజ్ లో సీన్స్ ని ఆమె చేసింది. అలాగే పెదవి ముద్దు సన్నివేశాలు అయితే లెక్కే లేవు. ఇవి ఖచ్చితంగా సినీ రంగంలో సర్వ సాధారణం సో ఈ లెక్కన చూసుకుంటే బోల్డ్ సీన్స్ వంటి వాటి విషయంలో శోభితకి సమంత కంటే కొంచెం ఎక్కువ మార్కులుతోనే పైన ఉంటుంది.

కాబట్టి సమంత నాగ చైతన్యలు విడిపోవడానికి ఆమె చేసిన బోల్డ్ సీన్స్ అనేవి అస్సలు కారణమే కాదు అని ఇప్పుడు తేలిపోయింది. కానీ దీనికి మించిన బలమైన కారణం తోనే వారు విడిపోయారు అని చెప్పొచ్చు. మరి ఆ బలమైన కారణం ఏమై ఉంటుందో అనేది ఇప్పటికీ సస్పెన్స్ అని చెప్పి తీరాలి. ప్రస్తుతం అయితే సోషల్ మీడియా అంతా చైతు రెండో పెళ్లి విషయం తోనే ఫిల్ అయిపొయింది.


Click it and Unblock the Notifications











