నాగచైతన్య 'జోష్'కు 4 కోట్లు
యువసామ్రాట్ నాగార్జున వారసుడు నాగచైతన్య 'జోష్' చిత్రం ద్వారా తెరంగేట్రం చెయ్యబోతున్న విషయం తెలిసిందే..నూతన దర్శకుడు వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 3న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియో మంచి ఆదరణ పొందుతోంది. సందీప్ చౌతా సంగీతాన్ని అందించారు.
ఇక ఈ చిత్రానికి నాగచైతన్య అందుకున్న పారితోషికం అక్షరాలా 4 కోట్లు అని విశ్వసనీయ సమాచారం. నాగార్జున పారితోషికం విషయంలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చెయ్యనప్పటికీ దిల్ రాజే ఈ మొత్తాన్ని నిర్ణయించినట్టు సమాచారం. టాలీవుడ్ లో ఎస్టాబ్లిష్డ్ హీరోలు అందుకునే పారితోషికం తన మొదటి సినిమాతోనే అందుకున్నారు చైతన్య.
ఇందులో నాగచైతన్యకు జోడీగా అలనాటి కథానాయిక రాధ కుమార్తె కార్తిక నటించింది. జె.డి.చక్రవర్తి ప్రతినాయకుడుగా నటించాడు.
josh naga chaitanya nagarjuna karthika dil raju radha sandeep chowta vasu varma jdchakravarthy జోష్ నాగచైతన్య నాగార్జున కార్తిక దిల్ రాజు వాసువర్మ రాధ జెడిచక్రవర్తి సందీప్ చౌతా


Click it and Unblock the Notifications