నాగ చైతన్య ఫ్యాన్స్ నాగార్జున పై గరం గరం!?
సినిమాలు చేయడం, అవి విడుదలకు ముందే పబ్లిసిటి ఇవ్వడం, విడుదలయ్యాక కొంతకాలం ప్రమోట్ చేయడం మినహా ఆ చిత్రం ఎలా రన్ అవుతోంది, రికార్డ్స్ తదితర విషయాల గురించి అస్సలు పట్టించుకోని హీరో అక్కినేని నాగార్జున. గీతాంజలీ, శివ వంటి మంచి మంచి సినిమాలు, సంతోషం, అన్నమయ్య, శ్రీ రామదాసు, నువ్వు వస్తావని వంటి హిట్ చిత్రాలు తీసినప్పటికీ తన పాతికేళ్ళ కెరీర్ లో ఏ సినిమాకీ నాగార్జున రన్ రావాలని, రికార్డులు, అవార్డులు కావాలని పట్టుబట్టలేదు.
అయితే ఇప్పుడు తనయుడు నాగచైతన్య విషయంలో కూడా నాగార్జున అదే పంథా ఫాలో అవుతున్నారు. అయితే ఇది నాగార్జున అభిమానులకి ఏమాత్రం మింగుడు పడడం లేదు. నాగాచైతన్య రెండో సినిమా ఫీల్ గుడ్ మూవీగా 'ఏమాయ చేసావె" ఇటు తెలుగు ప్రేక్షకులను అటు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాగార్జున తనయుడు నాగచైతన్యకు హిట్ ఇచ్చి నిలబెట్టిన చిత్రమిది. అలాంటి చిత్రాన్ని వైజాగ్ లో థియేటర్ లో రన్ చేయక తీసేయడం పట్ల అభిమానులు ఆగ్రహావేశాలు చూపిస్తున్నారు. మంచిగా రన్ అవుతూ షేర్ వస్తున్న చిత్రాన్ని తీసేస్తుంటే ఏ మాత్రం స్పందించని తమ హీరో పై యుద్ధం ప్రకటించారు. నాగార్జునని తిడుతూ పాంప్లెట్లు కూడా ముద్రించి తమ ఆగ్రహాన్ని వ్యక్త చేశారు.


Click it and Unblock the Notifications











