నాగ చైతన్యపై హై ప్రెజర్
నాగచైతన్య చాలా ఒత్తిడి గురిఅవుతున్నాడని, నాగార్జున కుమారుడు కావటంతో హై ఎక్సపెక్టేషన్స్ ఉంటాయని అదే ప్రెజర్ కి గురిచేస్తోందంని మరో హీరో సుశాంత్ చెప్తున్నారు. సుశాంత్ హీరోగా చేసిన రెండవ సినిమా కరెంట్ విడుదల అవుతున్న సందర్భంగా ఈ విషయాన్ని మీడియా దగ్గర వెళ్ళడించారు. తనూ, నాగచైతన్య ఇద్దరూ ముంబయిలో ఏక్టింగ్, మార్షిల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నామని అన్నారు. ఇద్దరూ కలిసి ముంబయిలో ఓ అపార్ట్ మెంట్లో రెంట్ కి ఉండి క్లాసులకు వెళ్ళేవారమని అన్నారు. తేడా ఏమిటంటే నేను ముందుగా కాళిదాసుతో ఎంట్రీ ఇచ్చానని చెప్పారు.
అలాగే యంగ్ హీరోలు ఇప్పుడు తెలుగు పరిశ్రమ నిండా ప్రవేశిస్తున్నారని, ఇది తీవ్రమై పోటీ వాతావరణం అని చెప్పుకొచ్చారు. ఇక ఏ నటుడునైనా మెదట సినిమా వరకూ ప్రేక్షకులు క్షమిస్తారని, రెండో సినిమాకు తప్పనిసరిగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. అలాగే తాను తన సినిమా మొదట రోజునే ప్రేక్షకుల మధ్యన కూర్చుని చూడటాన్ని ఇష్టపడతాను అన్నారు. అప్పుడయితే ప్రేక్షకుల పల్స్ తెలుస్తుందని, ఎప్పుడు వారు నవ్వుతున్నారో, ఎప్పుడు ఏడుస్తున్నారో అర్ధమవుతుందని అంటున్నాడు. ఇక సుశాంత్-స్నేహ వుల్లాల్ జం టగా సూర్య ప్రతాప్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై శ్రీమతి ఎ.నాగ సుశీల-చింతలపూడి శ్రీనివాసరావులు సం యుక్తంగా నిర్మించారు.


Click it and Unblock the Notifications











