నాగచైతన్య ప్రస్తుతం అమృత్ సర్ లో ఉన్నారు. దిల్ రాజు నిర్మాతగా వాసువర్మ అనే నూతన దర్శకుడు డైరక్షన్లో నిర్మితమవుతున్న చిత్రం షూటింగ్ కోసం చైతన్య అక్కడకెళ్ళారు. ఈ చిత్రం లో రాధ కూతరు కార్తిక హీరోయిన్ గా చేస్తోంది. మమతా మోహన్ దాస్ ఒక పాట పాడుతోంది. సందీప్ చౌతా సంగీతాన్ని అందిస్తున్నారు. జెడి చక్రవర్తి విలన్ గా చేస్తున్నారు. అనూష్క ఒక ఐటం సాంగ్ లో అలరించనుంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో అద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నట్లు దర్శక, నిర్మాతలు చెప్తున్నారు.