నాగచైతన్య కొత్త చిత్రం పిబ్రవరి 25న ప్రారంభం
నాగార్జునతో గగనం చిత్రం రూపొందించిన రాధామోహన్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ కొత్త చిత్రం కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పిబ్రవరి 25న ప్రారంభం కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ చిత్రం లాంచింగ్ జరుగుతుంది. ఇండస్ట్రీలోని ప్రముఖలను ఈ చిత్రం ప్రారంభానికి ఆహ్వానిస్తున్నారు. గౌరవం టైటిల్ తో రూపొందే ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో రూపొందనుంది. అలాగే ఈ చిత్రం గ్రామీణ నేపధ్యంలో రూపొందనుందని సమాచ్రం. గౌరవం చిత్రంలో నాగార్జన తొలి సారిగా నాగచైతన్యతో కలిసి నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం నాగచైతన్య దేవా కట్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రంలో నటిస్తున్నాడు.ఈ రెండు చిత్రాల తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేసే అవకాశం ఉంది. దడ, బెజవాడ వరుస ప్లాపులతో వెనకబడ్డ నాగచైతన్య తర్వలో విడుదలకు సిద్ధం కాబోతున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రంపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నటించబోయే చిత్రానికి 'యజ్ఞం ', 'వీరభద్ర' ఫేం రవికుమార్ చౌదర్శకత్వం వహించనున్నారు. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











