నాగచైతన్య అదిమి పెట్టిన స్ప్రింగ్ లాంటి వాడు....
నా వుద్దేశంలో చైతు అదిమి పెట్టిన స్ప్రింగ్ లాంటి వాడు. అతనికి నటుడిగా మంచి భవిష్యత్తు వుంది అంటూ మెచ్చుకున్నారు దర్శకుడు సుకుమార్. ఆయన దర్శకత్వంలో రూపొందిన 100% లవ్ చిత్రం క్రితం శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ హ్యాపీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...నాగచైతన్య ఈ కథకు 100% యాప్ట్ అయ్యాడు. ఓ సన్నివేశాన్ని చెప్పగానే దాన్ని అతను మలుచుకున్న విధానం నాకు ఎంతో నచ్చేది.
కొన్ని కొన్ని సన్నివేశాల్లో చైతూ నటన చూసి షాక్ అయ్యేవాడ్ని. తమన్నా తెల్ల కాగితం లాంటింది. దానిపై మనం ఏమైనా రాసుకోవచ్చు. చక్కని ఎక్స్‌ప్రెషన్స్ ఆమె సొంతం అన్నారు. ప్రస్తుతం సుకుమార్ తన తదుపరి చిత్రం మహేష్ తో ప్లాన్ చేస్తున్నారు. అలాగే నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని అజయ్ భుయాన్ దర్శకత్వంలో చేస్తున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆ చిత్రం రూపొందుతోంది. అలాగే ఆ చిత్రం తర్వాత వర్మ సమర్పణలో వివేక్ దర్శకత్వంలో బెజవాడ రౌడీలు చిత్రం ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











