ఇప్పటికైనా నాగచైతన్య తెలిసొచ్చింది

By Srikanya

హైదరాబాద్ : స్టార్ హీరో అవ్వాలంటే కమర్షియల్ సినిమాలే చెయ్యాలనేది నిజమే కానీ రొటిన్ ఫార్ములాతో నడిచే కథల వల్ల పెద్దగా కలిసి వచ్చేదేమీ ఉండదు. కంఫర్ట్ జోన్ లో ఉన్నామనిపించే ఈ తరహా చిత్రాలు కొద్దిగా తేడా వచ్చినా భాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేస్తాయి. అదే వైవిధ్యమైన కథలతో వచ్చే చిత్రాలు అయితే పెద్దగా అలరించకపోయినా...విభిన్నమైన చిత్రం తీసామన్న తృప్తీ ఉంటుంది. పేరూ ఉంటుంది. దాన్నే మనం చిత్రంతో అర్దం చేసుకున్నాను అంటున్నాడు నాగచైతన్య.

నాగచైతన్య మాట్లాడుతూ... కొత్త కథలు, సినిమాలు వస్తే తెలుగు జనాలు చూడరని అంటుంటారు. ఇది అబద్ధం. ఎందుకంటే సినిమా అర్థమయ్యేటట్లు తీస్తే ఎవరైనా చూస్తారు. కేవలం వాణిజ్యపరమైన సినిమాలు చేసి కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాను. దీంతో కథలో వైవిధ్యం ఉంటేనే ఆడుతుందని అర్థమైంది. ఇక అలాంటి సినిమాలే చేయాలనుకున్నా. నటుడిని ప్రతిభ మాత్రమే జీవితాంతం కాపాడుతుంది. కుటుంబ నేపథ్యాలు కాపాడవు. అందుకే జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంటున్నాడు.

Naga Chaitanya happy with Manam

నాగచైతన్య గతంలో మాస్ హీరో ఇమేజ్ కోసం...కమర్షియల్ హిట్ కోసం... బెజవాడ,దడ చిత్రాలు చేస్తే ఆ రెండూ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. తర్వాత చేసిన రీమేక్ తఢాఖా తో కాస్త కోలుకున్నాడు. కమర్షియల్ విజయం కోసం చేసిన మరో చిత్రం ఆటోనగర్ సూర్య ...బిజినెస్ లేక అలాగే డబ్బాల్లో మిగిలిపోయి...రిలీజ్ ఎప్పుడు చేస్తారా అన్నట్లు ఎదురుచూస్తోంది. మనం హిట్టైంది కాబట్టి ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందంటున్నారు.

ఇదిలావుంటే... నాగచైతన్య ఇప్పుడు మరో రీమేక్‌ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. పంజాబీలో విజయవంతమైన 'సింగ్‌ వర్సెస్‌ కౌర్‌' చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. అందులో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తారు. మొదట ఈ చిత్రంలో రానా నటిస్తారని ప్రచారం సాగింది. అయితే ఈ కథరీత్యా చైతన్య అయితేనే బాగుంటుందని నిర్ణయించారు. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్మాత డి.రామానాయుడు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X