'గుండమ్మ కథ' రీమేక్ కి నాగచైతన్య, ఎన్టీఆర్ రెడీ
'గుండమ్మ కథ' రీమేక్ లో ఎన్టీఆర్ పాత్ర చెయ్యడానికి తాను సిద్ధమేననీ, అయితే అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి ఆయన పాత్రను చెయ్యడానికి ఎవరైనా వస్తే చేస్తాననీ జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సంగతి నాగచైతన్య వద్ద ప్రస్తావించినప్పుడు తన తాతగారి పాత్ర చెయ్యడానికి తాను రెడీయేనని ఆయన స్పష్టంచేశారు.సుకుమార్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించే చిత్రం ఓపెనింగ్ సందర్భంగా ఈ విషయం ప్రస్ధావన వచ్చింది. 'గుండమ్మ కథ' రీమేక్‌లో నటించటానికి వీళ్ళిద్దరూ రెడీనే కాబట్టి దర్శకుడూ,నిర్మాతే ఫైనలైజ్ కావాల్సి ఉంది. అయితే వివి వినాయిక్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తే బావుంటుందని సురేష్ ప్రొడక్షన్ లో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
నాగచైతన్య జూ ఎన్టీఆర్ వివి వినాయిక్ గుండమ్మ కథ ఎఎన్నార్ naga chaitanya jr ntr gundamma katha sukumar


Click it and Unblock the Notifications