నాగచైతన్య ‘ఖైదీ నెం.201’
నాగచైతన్య ఖైదీ నెం. 201. నాగార్జున 'కేడీ' సినిమా చేశాడు కదా అని ఆయన కొడుకు నాగచైతన్య 'ఖైదీ నెం. 201' పేరుతో సినిమా తీస్తున్నాడనుకుంటే పొరపాటే. అసలు వివరాల్లోకి వెళితే...నాగచైతన్య హీరోగా ప్రస్తుతం 'ఆటో నగర్ సూర్య' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవా కట్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య నేరస్తుడిగా చంచల్ గూడ జైలుకెళ్లే సన్నివేశం ఉంటుంది. జైల్లో నాగచైతన్య ఖైదు నెంబర్ 201. అదన్నమాట మ్యాటర్.
ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. విజయవాడకు చెందిన ఓ బలమైన కార్మిక యూనియన్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ రూ. 2 కోట్లతో నిర్మించిన బస్తీ సెట్‌లో జరుగుతోంది.
నాగచైతన్య, సమంత, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈచిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటో గ్రపీ: శ్రీకాంత్ నరోజ్, ఎడిటింగ్: గౌతం రాజు, స్టూడియో: ఆర్ఆర్ మూవీ మేకర్స్, మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్, డిస్ట్రిబ్యూటర్స్: ఆర్ ఆర్ ఫిల్మ్ డిస్ట్రి బ్యూటర్స్, నిర్మాతలు: ఆర్ ఆర్ వెంకట్, కె. అచ్చిరెడ్డి, కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: దేవా కట్ట.


Click it and Unblock the Notifications











