నాగ చైతన్య ఇంకా బ్రహ్మచారే.. నిజమే అంటున్న సమంత!
టాలీవుడ్ క్రేజీ కపుల్స్ చైతు, సమంత మరో మారు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు వినోదాన్ని పంచారు. చైతు చేసిన ట్వీట్స్ కు సమంత ఎప్పుడూ సరదాగా రిప్లై ఇస్తుంది. హీరో సుశాంత్ వలన చైతు, సమంత మధ్య సరదాగా ట్విట్టర్ లో సంభాషణ జరిగింది. హీరో సుశాంత్ చాలా గ్యాప్ తీసుకుని చి ల సౌ చిత్రంలో నటిస్తున్నాడు. చి ల సౌ చిత్రం ఆగష్టు 3 న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆడియన్స్ కు ఓ ఆఫర్ విడుదుల చేసింది.
Fill the google form below with your best ‘excuse’ to postpone marriage! The winners can watch #ChiLaSow BEFORE Release with an amazing after PARTY!
Lets get the party STARTED!https://t.co/pfXDEj1Xle — Sushanth A (@iamSushanthA) July 25, 2018 '>
బ్యాచులర్ పార్టీ
హలొ బాయ్స్ అండ్ గర్ల్స్ మిమ్మల్ని బ్యాచులర్ పార్టీకి ఆహ్వానిస్తున్నాం అంటూ సుశాంత్ ట్వీట్ చేసాడు. మీరు పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకునేందుకు మంచి కారణం చెప్పిన వారు చి ల సౌ చిత్రాన్ని విడుదలకు ముందే చూసే అవకాసం కల్పిస్తామని తెలిపాడు. ఆ తరువాత పార్టీ కుడా ఉంటుందని ట్వీట్ చేసాడు.
స్పందించిన చైతు
సుశాంత్ ట్వీట్ కు నాగ చైతన్య రిప్లై ఇచ్చాడు. బ్యాచులర్స్ మాత్రమే అంటున్నావ్ అంటే పార్టీకి నన్ను పిలవవా అని సరదాగా వ్యాఖ్యానించాడు. నాలో ఇంకా బ్రహ్మచారి బ్రతికే ఉన్నాడని చైతు ఫన్నీ రిప్లై ఇచ్చాడు.
నిజమే అంటున్న సమంత
నాగ చైతన్య ట్వీట్ కు సమంత కుడా అంటే ఫన్నీగా స్పందించింది. భార్తగారు మీరు చెప్పింది నిజమే అంటూ వ్యాఖ్యానించింది. వీరి ముగ్గురి మధ్య జరిగిన ఈ సంభాషణ నెటిజన్లని ఆకట్టుకుంటోంది.

చి ల సౌ
కొత్త గ్యాప్ తీసుకుని హీరో సుశాంత్ చి ల సౌ చిత్రంలో నటిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. రుహాని శర్మ హీరోయిన్.


Click it and Unblock the Notifications











