నాగ చైతన్య కూడా ఖాతా తెరిచాడండోయ్!
హైదరాబాద్: ప్రస్తుతం సినిమా తారలు తమ అభిమానులకు టచ్‌లో ఉండటానికి, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి, తమకు సంబంధించని విషయాలను అభిమానులతో పంచుకోవడానికి సోషల్ నెట్వర్కింగు విరివిగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక మంది స్టార్స్ ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగు సైట్లలో ఖాతాలు తెరిచారు.
తాజాగా ఈ లిస్టులో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా చేరి పోయాడు. నాగ చైతన్య ట్విట్టర్ అడ్రస్ twitter.com/chay_akkineni. 'హాయ్ ఎవ్రీవన్. ఫైనల్‌గా సోషల్ నెట్వర్కింగ్ ప్రపంచంలోకి రావాలని డిసైడయ్యాను' అంటూ తొలి ట్వీట్ చేసారు. దీంతో పాటు 'మనం' చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు.

అన్నపూర్ణ స్టూడియాస్ పతాకంపై అక్కినేని మూడు తరాల హీరోలైన నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి 'ఇష్క్' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం మే 23 న విడుదల చేయనున్నట్లు నాగార్జున తెలియచేసారు.
ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











