నాగచైతన్య, కాజల్ జంటగా నటిస్తున్న సినిమా టైటిల్ అదేనా..?
కింగ్ నాగార్జునతో ఎదురులేని మనిషి, కింగ్, రగడ లాంటి సూపర్ హిట్ సినిమాలను నర్మించినటువంటి కామాక్షి కళామూవీస్ త్వరలో నాగ చైతన్యతో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాలో మగధీర చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని నాయికగా చెలామణి కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. డార్లింగ్, బృందావనం ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న కాజల్, నాగ చైతన్యతో గాడమైన ప్రేమలో వున్నారు. అతనే 'నా డ్రీమ్ లవర్' అంటూ కాజల్ తెగ సంతోషపడుతూ చెబుతున్నారు.
ఈ ఇద్దరు కలిసి అజయ్ భూయాన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి 'డ్రీమ్ లవర్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. కామాక్షి కళామూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. ఈచిత్రాన్ని కామాక్షి కళామూవీస్ అధినేత డి శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాజల్‌తో పాటు ఈసినిమాలో సంయుక్త, శ్రీరామ్, ముఖేష్ రిషి, కెల్లీ దోర్జి, రాహుల్ దేవ్ తదితర తారగణం నటిస్తున్నారు.
ప్రస్తుతం నాగచైతన్య గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్నటువంటి సినిమాలో బిజిగా ఉన్నారు. ఈసినిమాకి దర్శకత్వం ఆర్య డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈసినిమాలో నాగచైతన్య కాలేజి స్టూడెంట్‌గా నటిస్తున్నారు. ఈసినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండే కాజల్ ప్రస్తుతం ప్రభాస్‌తో నటించినటువంటి మిస్టర్ ఫరపెక్ట్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











