అజయ్ భుయాన్ దర్శకత్వంలో నాగచైతన్య 'దడ'
అక్కినేని నట వారసుడు నాగచైతన్య, కాజల్ హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి 'దడ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పూర్తిస్తాయి మాస్ సబ్జెక్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి 'దడ' అనే పేరు సరిగ్గా సరిపోతుందని సినిమా రూపకర్తలు భావిస్తునట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది. తరవాత సినిమా ఫస్ట్ లుక్ అలాగే ప్రచార చిత్రాలు విడుదల చేయనున్నారు.
యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర వైవిద్యంగా ఉంటుందని తెలుస్తుంది. అజయ్ భుయాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని కామాక్షి కళామూవీస్ బ్యానర్ ఫై నిర్మాత శివప్రసాద్ రెడ్డి కుమారుడు చందన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్న ఈ చిత్రం జూలై ఆఖరి వారంలో కాని, ఆగస్ట్ ప్రధమార్ధంలో కాని విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











