నాగచైతన్య, గౌతం మీనన్ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో
ఇదొక వెరైటీ లవ్ స్టోరీ, నాగతైన్య బాడీ లాంగ్వేజ్ కు ఎలాంటి కథ సరిపోతుందో అలాంటి కథతో ఈ చిత్రాన్ని ఎంతో బాధ్యతాయుతంగా తెరకెక్కిస్తున్నాను.. ప్రేమ కథలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది..అంటూ నాగచైతన్య హీరోగా తాజా చిత్రం గురించి దర్శకుడు గౌతం మీనన్ చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎఆర్ రెహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది..అలాగే అనంత్ శ్రీరామ్ చక్కటి సాహిత్యం అందించారరు...అక్కినేని అభిమానులకు ఈ చిత్రం విందు భోజనంలాటిందని అంటూ ఈ చిత్ర విశేషాలు చెప్పారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నాగచైతన్యకు జోడిగా కొత్తమ్మాయి సుమంత పరిచయమవుతోంది. న్యూయార్, కేరళలో కీలకమైన షూటింగ్ జరుపుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలోని మెరీనా తీరంలో షూటింగ్ జరుపుకొంటోంది.ఇక షూటింగ్ విశేషాలు తెలుపుతూ.. మెరీనా బీచ్ లో వారం రోజుల పాటు షూటింగ్ షెడ్యూల్ జరుగుతుంది. అనంతరం హైద్రాబాద్ లో షూటింగ్ ఉంటుందనీ గౌతమ్ మీనన్ తెలిపారు.ఈ చిత్రానికి 'నువ్వే మాయ చేశావో గానీ' అనే టైటిల్ ని ఎంపిక చేసే అవకాసం ఉంది. ఇక ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో కృష్ణుడు, దేవన్, సురేఖావాణి, లక్ష్మి, సుధీర్, త్రిష ఎలెక్స్ తదితరులు నటిస్తున్నారు. ఉమర్జీ అనూరాధ మాటలు, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జోష్ చిత్రం తర్వాత నాగచైతన్య హీరోగా వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. గౌతమ్ మీనన్ గతంలో వెంకటేష్ హీరోగా ఘర్షణ అనే చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











