For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Love Story Full Movie Leaked: నాగచైతన్యకు బిగ్ షాక్.. రిలీజ్ అయిన గంటల్లోనే లీక్.. ఆ సైట్‌లో డౌన్‌లోడ్ లింక్

  |

  సినీ పరిశ్రమలో ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పైరసీ. నిజానికి ఈ సమస్య ముందు నుంచే ఉండేది. ఒకప్పుడు సినిమా థియేటర్లలో సినిమాలు విడుదలైన కొంత సమయంలో సీడీ, డీవీడీల రూపంలో ప్రింట్లు బయటకు వచ్చేసేవి. అయితే తొండ ముదిరి ఊసరవెల్లి ఆయినా చందాన సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఈ పైరసీ పెను భూతంగా మారింది. ఈ పైరసీ కారణంగా సినిమా కలెక్షన్లు కూడా నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. థియేటర్లలో విడుదలవుతున్న సినిమాల పరిస్థితి ఒకటైతే ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల సంగతి మరీ దారుణం.

  స్ట్రీమింగ్ మొదలైన సెకనులో డౌన్ లోడ్ చేసి మరీ లీక్ చేస్తున్నారు. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య సాయి పల్లవిల లవ్ స్టోరీ సినిమా కూడా లీక్ అయింది. ఆ ఒక్క సినిమానే కాక ఈరోజు తెలుగులో రిలీజయిన పరిణయం, ఆకాశవాణి, అలాంటి సిత్రాలు లాంటి సినిమాలు కూడా హెచ్డీ క్వాలిటీతో బయటకు వచ్చేశాయి. ఆ వివరాలు మీకోసం!

  ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా

  ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా

  టాలీవుడ్‌ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు లవ్ స్టోరీ మానియా కనిపిస్తోంది. సెకండ్ వేవ్ తరువాత అతి మూవీ అది పెద్ద సినిమాగా రిలీజ్ అయింది లవ్ స్టోరీ. అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటించడం సెన్సిబుల్ కథలతో చాలా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా రావడంతో సినిమా ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

  అదీకాక వరుణ్ తేజ్ ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల నాగచైతన్య సాయి పల్లవి జంటగా ఈ లవ్ స్టోరీ సినిమా చేశాడు. నారాయణ దాసు నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా నిజానికి ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వివో ముంచుకు రావడంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు గా ముందుగా ప్రకటించారు.

  Avika Gor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన చిన్నారి పెళ్లి కూతురు హీరోయిన్.. ప్రైవేటు పార్టులో టాటూను చూపిస్తూ!

  పెద్ద రచ్చ

  పెద్ద రచ్చ

  అంతా సర్దుకున్నాక ఈ సినిమాని సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే అనుకోకుండా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించిన తరువాత నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. అయితే దానిని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థకు అమ్మేయడంతో పండుగ రోజు గడప దాటకుండా ఆ సినిమా చూసి తమ సినిమాని ఎక్కడ లైట్ తీసుకుంటారో అన్న ఉద్దేశంతో నిర్మాతలు ముందు జాగ్రత్త పడ్డారు.

  నారాయణ దాస్ నారంగ్ కు తెలంగాణ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండడంతో ఆయనకు మద్దతుగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నానిని తూర్పారబట్టారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెబుతూ అవసరమైతే భవిష్యత్తులో నీ సినిమాలు బంద్ చేస్తామని కూడా ప్రకటించారు

  భారీ అంచనాలతో

  భారీ అంచనాలతో

  అంతా సద్దుమణిగాక ఈ లవ్ స్టోరీ సినిమాను సెప్టెంబర్ 24వ తేదీన విడుదల చేయాలని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ అంచనాలతో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలు సినిమా మీద నెలకొని ఉండడంతో చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు హైదరాబాద్ సహా అమెరికా లాంటి లొకేషన్ లో సైతం భారీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నమోదయ్యాయి.

  చాలా కాలం తర్వాత థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డు లతో కలకలలాడుతూ ఉండడం కూడా కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.

  సినిమా ఎలా ఉందంటే

  సినిమా ఎలా ఉందంటే

  ఈ సినిమాలో సమాజంలో కనిపించే స్త్రీ వివక్ష సమస్యలను బాగా ఎత్తిచూపే విధంగా చాలా సెన్సిబుల్ గా కథను భాగా డీల్ చేశారు అనే మాటలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరి నటన అయితే సినిమాకి ఎస్సెట్ గా నిలుస్తుందని సాయి పల్లవి నాగచైతన్య డాన్స్ అలాగే సినిమాకు అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు. సాధారణ రొటీన్ ఫ్యామిలీ డ్రామా సినిమా అయినా సాయి పల్లవి నాగచైతన్య తన నటనతో సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లారు అనే మాటలు వినిపిస్తున్నాయి.

  ఆ వెబ్ సైట్స్ లో లీక్

  ఆ వెబ్ సైట్స్ లో లీక్

  అయితే ఈ సినిమాతో చైతన్య మరో హిట్ కొట్టాడు అని అక్కినేని అభిమానులు ఆనందిస్తూ ఉండగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన వెంటనే పైరసీ వెబ్ సైట్స్ లో కూడా లీక్ అవ్వడం అటు శేఖర్ కమ్ముల టీం సహా అక్కినేని అభిమానులు అందరినీ కలవరపెడుతోంది. ఈ సినిమా ప్రీమియర్ షోలు ముందుగా అమెరికాలో ప్రసారమయ్యాయి.

  అలాగే హైదరాబాద్ సహా ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో ని వివిధ ప్రాంతాల్లో ఉదయం నుంచి షోలు పడుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా ఇప్పుడు హెచ్డీ క్వాలిటీ తో మూవీ రూల్స్, ఐ బొమ్మ వంటి కొన్ని వెబ్ సైట్ లలో దర్శనమివ్వటం అందరికీ షాక్ ఇస్తోంది. అక్కినేని అభిమానులు అయితే ఇలాంటి లింక్ ఎక్కడ కనిపించినా వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

  Love Story Movie Success Meet | Naga Chaitanya | Sai Pallavi
  ఈ ఒక్క సినిమానే కాదు

  ఈ ఒక్క సినిమానే కాదు

  ఇక ఈ సినిమానే కాదు ఈ మధ్య కాలంలో విడుదలైన చాలా సినిమాలు కూడా రిలీజ్ అయిన రోజే లీక్ అవుతున్నాయి.. గత వారం విడుదలైన నితిన్ మాస్ట్రో అంతకుముందు విడుదలైన నాని టక్ జగదీష్ సినిమాలు కూడా ఆన్లైన్లో ప్రత్యక్షం కాగా ఈ రోజు మరో మూడు నాలుగు సినిమాలు విడుదల కాగా ఆ నాలుగు సినిమాలు కూడా ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి.

  పూరి జగన్నాథ్ శిష్యుడు దర్శకుడిగా మార్చేసిన అలాంటి చిత్రాలు సినిమా, ఎస్ ఎస్ రాజమౌళి కొడుకు నిర్మాతగా మారి చేసిన ఆకాశవాణి, అలాగే తనీష్ హీరోగా వచ్చిన మరోప్రస్థానం, దుల్కర్ సల్మాన్ పరిణయం సినిమాలు కూడా ఇప్పుడు ఈ వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి.

  English summary
  Naga Chaitanya's Love Story Movie Released today, and in a shocking note movie is On Movierulz For Free Download.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X