»   »  మెట్రో పై ఎందుకింత సీక్రెసీ?? నాగ చైతన్య కోసమేనా?

మెట్రో పై ఎందుకింత సీక్రెసీ?? నాగ చైతన్య కోసమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళంలో జూన్ 24 న రిలీజ్ అయి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న మెట్రో తెలుగులో రీమేక్ కానుంది. ఆది హీరోగా తెరకెక్కి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చుట్టాలబ్బాయి నిర్మాత రామ్ తాళ్ళూరి శృట్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి రైట్స్ సొంతం చేసుకున్నారు. సురేష్ కొండేటి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

తన కన్నతల్లి చావుకు కారణమైన చైన్ స్నాచర్ ని పట్టుకోవడానికి ప్రయత్నించిన జర్నలిస్ట్... ఆ క్రమంలో తను తెలుసుకున్న నిజాలేంటి..? అవతల చైన్ స్నాచర్ ల లక్ష్యమేంటి..? అనే కథాంశంతో తెరకెక్కిన మెట్రో... తమిళనాట సంచలన విజయం సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాకి విమర్శకులతోపాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

Naga Chaitanya

ఇప్పుడీ చిత్రాన్ని నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ చేయాలని 'మెట్రో' మూవీ దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారనీ, ఇప్పటికే వాళ్ళు చైతూని కలసి కథ వినిపించగా.. అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపించాయి. మోడరన్ డే క్రిమినల్స్, చైన్ స్నాచింగ్, సైకోయిజం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా కథ చైతూకి బాగా నచ్చిందని, అందుకే ఈ మూవీ రీమేక్‌లో నటించేందుకు అతడు ఒప్పుకున్నాడని అన్నారుకానీ మళ్ళీ ఎక్కడా ఆవిషయం పెద్దగా బయటికి రాలేదు.


మెట్రో తెలుగులో యూత్ ఫుల్ యంగ్ హీరో ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. అది నాగ చైతన్య నేనా కాదా అన్నదాన్లో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. బాబీసింహ ఒక ముఖ్య పాత్రలో నటించారు. మాడరన్ క్రిమినల్ మైండ్ సెట్ ని ఎక్స్ పోజ్ చేస్తూ క్రైం థ్రిల్లర్ గా... ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కనున్న మెట్రో మిగతా వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు చిత్రం యూనిట్.

Read more about: naga chaitanya, samantha
English summary
The buzz reveals that the actor will next be seen in the Tamil remake of Metro. Metro is the latest successful Tamil crime thriller. Naga Chaitanya most likely plays the lead role in the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu