నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగచైతన్య చిత్రం...డిటేల్స్
అలా మొదలైంది చిత్రంతో తెలుగులో హాట్ ఫేవరెట్ డైరక్టర్ గా మారిన నందినీ రెడ్డికి ఇప్పుడు పెద్ద ఆఫర్ వచ్చింది. ఆమెను నాగార్జున పిలిచి తమ అన్నపూర్ణ బ్యానర్ పై నాగచైతన్యకు మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ రెడీ చెయ్యమని అడ్వాన్స్ ఇచ్చారని వార్త. అయితే నందినీ రెడ్డి తాను మెదట అనుకున్నట్లుగా బెల్లంకొండ సురేష్ కి సిద్దార్ధ తో చిత్రం చేయట లేదని, ఆ ప్లేసులో నాగచైతన్యను ఇమ్మని అడిగిందిట. దానికి నాగార్జున మరీ బెస్ట్ అన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అంటే త్వరలో నాగచైతన్య, నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందన్నమాట. ఈ వారం నాగచైతన్య నటించిన 100% లవ్ చిత్రం రిలీజవుతోంది. సుకుమార్ డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని సుకుమార్ డైరక్ట్ చేసారు.


Click it and Unblock the Notifications











