'నేషనల్ జాగ్రిఫిక్ ఛానెల్' లో నాగచైతన్య
ఏ మాయ చేసావె చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిన నాగ చైతన్య తాజాగా నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ తెలుగు వెర్షన్ కోసం యాడ్ చేసారు. ఆ ఎడ్వర్టైజ్ మెంట్ లో నాగచైతన్య తన వెనక కనపడే విజువల్స్ ని చూస్తూ మాట్లాడుతూంటాడు. పులి ని చూపిస్తూ...దీని చూపు నా చూపు కన్నా ఆరు రెట్లు ఎక్కువ. అలాగే ప్రపంచంలో అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ బిల్డింగ్ ముంబైలో కడుతున్నారు. దీని ఎత్తు అర కిలో మీటరు ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు మన ఇంట్లోనే ఉండి చూడచ్చు..మీ జాగ్రిఫిక్ ఛానెల్ లో..అంటూ చెప్తున్నారు. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఈ ఛానెల్ తెలుగు వెర్షన్ ప్రారంభం అయింది. ఈ యాడ్ తో నాగాచైతన్య కూడా తన తోటి హీరోల లాగ బ్రాండ్ అంబాసిడర్ అయినట్లే. ఇక నాగచైతన్య.. సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం రెడీ అవుతోంది. అలాగే అజయ్ భుయాన్ దర్శకత్వంలోనూ నాగచైతన్య ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











