»   » నాగ చైతన్య-సుధీర్ వర్మ మూవీ ఓపెనింగ్ (ఫోటోలు)

నాగ చైతన్య-సుధీర్ వర్మ మూవీ ఓపెనింగ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏ మాయ చేసావె, 100% లవ్, తడాఖా, మనం వంటి సూపర్ హిట్ చిత్రాల హీరో నాగ చైతన్య కథానాయకుడిగా, '1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్ హీరోయిన్‌గా, స్వామి రారా వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ నిర్మించిన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్ర ఈరోజు (జూన్ 12) ఉదయం 7.26 గంటలకు ఫిలింనగర్ దైవసన్నిధానంలో ప్రారంభమైంది. వెంకటేశ్వరస్వామి విగ్రహంపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాగ చైతన్య క్లాప్ కొట్టారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

నాగ చైతన్య మాట్లాడుతూ

నాగ చైతన్య మాట్లాడుతూ

ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ...‘సుధీర్ వర్మ తీసిన స్వామిరారా నాకెంతో ఇష్టం. ఈ సినిమా కోసం చాలా మంచి సబ్జెక్టు చెప్పారు. తప్పకుండా ఇది నా కెరీర్లో మరో హిట్ సినిమా అవుతుంది' అన్నారు.

బివిఎస్ ప్రసాద్

బివిఎస్ ప్రసాద్

నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘అత్తారింటికి దారేది' తర్వాత మా బేనర్లో చేస్తున్న ఈ సినిమా మరో డిఫరెంట్ మూవీ అవుతుంది. సుధీర్ వర్మ సబ్జెక్టు చాలా డిఫరెంటుగా ఉంది. నాగ చైతన్యకు హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్య కథ ఇది. నాగ చైతన్య కూడా కథ విని చాలా ఎక్సైట్ అయ్యారు. ఈ రోజు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాము. జులై 2 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాము. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా లావిష్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

సుధీర్ వర్మ

సుధీర్ వర్మ

దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ ‘అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ నిర్మించిన ప్రసాద్ గారి బేనర్లో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి రారా తర్వాత నేను చేస్తున్న ఈ సినిమా నాగ చైతన్యకు పూర్తి యాప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఈ సినిమా నా కెరీర్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది' అన్నారు.

నటీనటులు

నటీనటులు

బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, రవిబాబు, రావు రమేష్, ప్రవీణ్, పూజ, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

సంగీతం: సన్నీ ఎం.ఆర, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: నారాయణరెడ్డి, పాటలు: శ్రీమణి, కృష్ణ చైతన్య, కో డైరెక్టర్: విజయ్ సిహెచ్, స్టిల్స్: శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్ ఈదర, సమర్పణ: బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ.

English summary
Naga Chaitanya, who is reveling in the huge success of 'Manam' will be acting in a film to be produced by B.V.S.N.Prasad. Sudheer Varma of 'Swamy Ra Ra' fame will helm this project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu