నాగ చైతన్య కిది 'గీతాంజలి' రేంజ్
నాగార్జున కెరీర్ లో 'గీతాంజలి' బెస్ట్ చిత్రంగా ఎలా నిలిచిపోయిందో అలాగే తాము రూపొందిస్తున్న చిత్రం కూడా నాగచైతన్య కెరీర్‌లో అలా నిలిచిపోతుందని దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ చెప్పారు.ఆయన ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ఓ చిత్రం రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఎ.ఆర్.రహమాన్ సంగీతంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య లవర్‌బోయ్‌లా కనిపించనున్నారు. కొత్తమ్మాయి సమంత ఇందులో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. 'ఇందిరా ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్' పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం విశేషాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు.
ఈ సందర్బంగా నిర్మాత సంజయ్ స్వరూప్ మాట్లాడుతూ - "ఇదో అందమైన ప్రేమకథ. నాగచైతన్య బాడీ లాంగ్వేజ్‌కు, వయసుకు తగిన పాత్ర ఇందులో చేస్తున్నారు. ఆయన పెర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గౌతమ్ ఈ సినిమా చేస్తున్నారు. అలాగే ఎ.ఆర్.రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించారు. కథ రీత్యా సినిమా ఎక్కువ భాగం న్యూయార్క్‌లో, కొంత భాగం కేరళలో జరిగింది. రెండున్నర గంటల పాటు ఆహ్లాదాన్ని పంచే సినిమా ఇది. త్వరలో పాటలను, అతి త్వరలో సినిమాను విడుదల చేయనున్నాం' అని తెలిపారు.
ఇక ఈ చిత్రం ఇతర పాత్రల్లో కృష్ణుడు, దేవన్, సురేఖావాణి, లకీ, సుధీర్, త్రిష అలెక్స్ తదితరులు నటించారు. అలాగే ఈ సినిమాకు మాటలు: ఉమర్జీ అనురాధ, కెమెరా: మనోజ్ పరమహంస, సమర్పణ: సూపర్‌స్టార్ కృష్ణ.


Click it and Unblock the Notifications











