వావ్....నాగ చైతన్య లుక్ అదిరింది

By Bojja Kumar

హైదరాబాద్: ప్రస్తుతం నాగ చైతన్య ‘స్వామి రారా' దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. పాటలు, క్లైమాక్స్ సీన్స్ పూర్తి కావాల్సి ఉంది. ఈ చిత్రంలో నాగ చైతన్య లుక్ అదిరిపోయే విధంగా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసారు.

టైటిల్ ఇంకా అపీషియల్ గా ఖరారు కాలేదు. ఈ సినిమా ప్రొడక్షన్ టీం తమ బ్యానర్ లో ‘దోచెయ్' అనే టైటిల్ ని ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేసారు. దానికి తోడు ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కూడా దొంగే కావడంతో ‘దోచెయ్' అనే టైటిల్ ఫైనల్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Naga Chaitanya new look @ Sudheer Varma's Film

''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ. కృతి సనన్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రై.లి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ-‘ అత్తారింటికి దారేది తర్వాత మా బ్యానర్‌లో స్వామిరారా టెక్నిషియన్స్‌తో చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య చాలా డెటికేటెడ్‌ ఆర్టిస్ట్‌. స్టైలిష్‌గా ఉండే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నాగచైతన్య మూవీలో బెస్ట్‌ మూవీ అవుతుంది. ఆడియన్స్‌తో పాటు ఫ్యాన్స్‌కి కూడా బాగా నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పాటలు తప్ప టోటల్‌ టాకీ పార్ట్‌ కంప్లీట్‌ అయింది. పీటర్‌ హెయిన్స్‌ సారధ్యంలో ఒక థ్రిల్లింగ్‌ ఛేజ్‌ జరుగుతోంది'. అన్నారు.

Naga Chaitanya new look @ Sudheer Varma's Film

ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X