»   » ప్రియురాలి నడుము చూసి పరీక్ష రాసే ప్రియుడు

ప్రియురాలి నడుము చూసి పరీక్ష రాసే ప్రియుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగచైతన్య కథానాయ కుడిగా గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న భారీ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. కథాపరంగా కాలేజీ యువత ఐడెంటిఫై అయ్యే కథ. అతనొక ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌. అల్లరిలో ఫస్ట్‌...చదువులో లాస్ట్‌. కానీ ప్రియురాలు మాత్రం అల్లరిలో లాస్ట్‌...చదువులో పస్ట్‌. ప్రియుణ్ణి ఎలాగైనా ఇంజనీరింగ్‌ గట్టెక్కించాలనుకుంది. స్లిప్స్‌ చూసి రాస్తే ఎక్కడ పట్టుబడిపోతానో అని భయపడ్డాడు. దీంతో పరీక్షలో తన ముందు కూర్చొనే ప్రియురాలి నడుముపై కాపీ రాశారు. దాన్ని ఇప్పుడు కాపీ కొడుతున్నాడు. కాపీ కొట్టడంలో గొప్ప టెన్నిక్‌ కనుక్కొన్నాడు కదూ...ఇక ఈ కాపీరాయుడి దృష్టి అంతా ప్రియురాలి నడుముపై ఉన్న లెక్కపైనే. ఈ సన్నివేశం సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న చిత్రంలోనిది. ప్రియుడుగా నాగచైతన్య...ప్రియురాలిగా తమన్నా నటిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రంలోని కొన్ని స్టిల్స్‌ బయటికి వచ్చాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu