‘గుండెజారి గల్లంతయ్యిందే’ దర్శకుడితో నాగచైతన్య
హైదరాబాద్ : అక్కినేని యువ హీరో నాగ చైతన్య త్వరలో హిట్ దర్శకుడితో జతకట్టబోతున్నాడు. ఇటీవల నితిన్‌తో 'గుండె జారి గల్లంతయ్యిందే' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ కుమార్ కొండ త్వరలో నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి పతాకంపై నాగార్జున అక్కినేని ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు.
అక్బోబర్ నెలలో ఈచిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్టు వర్కుపై దృష్టి పెట్టాడు. ఇది పూర్తయిన వెంటనే షూటింగ్ ప్రారంభం కానుంది.
ప్రస్తుతం నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మరో వైపు...ప్రముఖ నిర్మాత రామానాయుడు తన మనవడు నాగ చైతన్య (కూతురు కొడుకు)హీరోగా సినిమా చేయబోతున్నాడు. పంజాబీ హిట్ మూవీ 'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రానికి రీమేక్ గా రూపొందబోయే ఈ చిత్రాన్ని తమ సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌పై నిర్మించబోతున్నారు.


Click it and Unblock the Notifications












