మా పెళ్ళైన తరువాత సమంత ఇంకా బిజీ అయింది.. నాగచైతన్య!
Recommended Video

టాలీవుడ్ కపుల్స్ నాగ చైతన్య, సమంత తొలిసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు, సమంత నంటించిన యూ టర్న్ చిత్రాలు గురువారం రోజు వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉండగా సమంత, నాగ చైతన్య వారి వారి చిత్రాలని ప్రమోట్ చేసుకునేందుకు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో చైతు సమంత గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా పెళ్ళైన తరువాత సమంత ఇంకా బిజీగా మారిపోయింది. ఎక్కువ చిత్రాల్లో నటిస్తోంది. ఇది నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం అని నాగ చైతన్య తెలిపాడు.

సమంత ఈ ఏడాది నటించిన విజయం సాధించాయి. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యూ టర్న్ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











