twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ చైతూ, సమంత పెళ్లి.. పెళ్లి పెద్దగా అఖిల్.. రానా ఎమోషనల్ ట్వీట్

    హిందూ సంప్రదాయం ప్రకారం చైతూ, సమంత పెళ్లి 7 తేదీన మళ్లీ క్రిస్టియన్ మతాచారం ప్రకారం మ్యారేజ్ హాజరుకానున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు

    By Rajababu
    |

    గత కొద్ది సంవత్సరాలు ప్రేమించుకొంటున్న నాగచైతన్య-సమంత శుక్రవారం రాత్రి పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం రాత్రి 11 గంటల 52 నిమిషాలకు సమంత మెడలో చైతూ తాళి కట్టారు. సమంత క్రిస్టియన్ మతానికి చెందిన వారు కావడంతో శనివారం మరోసారి ఆ మతాచారం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లి వేడుక శుక్రవారం సాయంత్రం 5.30 నుంచి ప్రారంభం కానున్నది.

    హిందూ సంప్రదాయం ప్రకారం

    హిందూ సంప్రదాయం ప్రకారం

    హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి వేడుక అనేక విశేషాలు చోటుచేసుకొన్నాయి. చైతూ, సమంతకు చాలా సన్నిహితులైన సినీ నటులు పెళ్లికి హాజరయ్యారు. చైతూ, పెళ్లి వేడుకలో వెన్నెల కిశోర్, సింగర్ చిన్మయి దంపతులు తదితరులు పాల్గొన్నారు.

    సెలబ్రేషన్స్‌లో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీస్

    సెలబ్రేషన్స్‌లో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీస్

    తొలిరోజు మ్యారేజ్ సెలబ్రేషన్స్‌లో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. నాగార్జున, వెంకటేష్, సురేష్ బాబు కుటుంబాలు రెండూ చాలా చక్కగా వివాహ వేడుకను నిర్వహించాయి. రామానాయుడు కుటుంబ సభ్యులు మంచిగా ఎంజాయ్ చేశారు.

    అఖిల్.. పెళ్లి పెద్దలా

    అఖిల్.. పెళ్లి పెద్దలా

    ఈ పెళ్లి వేడుకలో భాగంగా జరిగిన సంగీత్‌లో సురేష్ బాబు, సమంత కలిసి డ్యాన్సులు చేయడం ప్రధాన ఆకర్షణగా మారింది. ఇక నాగార్జున రెండో కొడుకు అఖిల్.. పెళ్లి పెద్దలా అన్నీతానై అతిథులకు ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం మరో హైలెట్. నాగార్జున-అమల కలిసి దగ్గరుండి నాగచైతన్య పెళ్లి హిందూ సంప్రదాయ ఆచారాలను తూచ తప్పకుండా జరిపించారు.

    హైఫై సొసైటీకి తగ్గకుండా

    హైఫై సొసైటీకి తగ్గకుండా

    గోవాలోని ఓ ప్రధాన బీచ్ తీరంలో విశాల స్థలంలో టెంట్లు, గుడారాలు వేసి అతిథులకు విడిది కల్పించారు. పెళ్లి సంప్రదాయబద్దంగా జరిగినా.. అతిథి సత్కారాలు మాత్రం హైఫై సొసైటీకి తగ్గకుండా రాయల్‌గా నిర్వహించారు.

    గ్రాండ్‌గా విందు వేడుక

    గ్రాండ్‌గా విందు వేడుక

    శనివారం రాత్రితో నాగచైతన్య, సమంత రెండు రోజుల పెళ్లి వేడుకలు ముగుస్తాయి. హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత రిసెప్షన్ తేదీని ప్రకటిస్తారు. గ్రాండ్ గా జరిగే విందు వేడుకకు భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించనున్నట్టు సమాచారం.

    మా కుటుంబంలో చాలా ఆనందం..

    సంతోషమంటే ఏంటో చైతూ, సమంతలను చూస్తే తెలుస్తుంది. చైతూ పెళ్లి వేడుక మా కుటుంబంలో చాలా చాలా సంతోషాన్ని నింపింది అని రానా ట్వీట్ చేశాడు. చైతూ, సమంతల పెళ్లి ఫోటోలను కూడా ట్యాగ్ చేశారు.

    తొలి రోజు పెళ్లిలో జరిగిన తంతు

    తొలి రోజు పెళ్లిలో జరిగిన తంతు

    పెళ్లి పీటలపై నాగ చైతన్య (వీడియో)

    పెళ్లి పీటలపై నాగ చైతన్య (వీడియో)

    English summary
    The wedding of Naga Chaitanya and Samantha in Goa yesterday was the talk of the town. While the Hindu wedding was held yesterday, the marriage will take place according to Christian traditions today. Only the kith and kin and a few select friends from the industry were in attendance for the event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X