మీ కల నెరవేరకముందే ఈ లోకం వదిలి వెళ్ళారు.. చైతూ ఎమోషనల్ పోస్ట్

Recommended Video

Hero Naga Chaitanya Emotional Tweet About D. Ramanaidu || Filmibeat Telugu

అక్కినేని ఫ్యామిలీకి, దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ రిలేషన్ గురించి అందరికీ పెద్దగా అవగాహన లేనప్పటికీ చాలా దగ్గరి అనుబంధమే అది. అక్కినేని వారసుడు నాగ చైతన్యకు, విక్టరీ వెంకటేష్ వరుసకు మేన మామ అవుతాడు. అలాగే దివంగత డాక్టర్ రామానాయుడు తాత అవుతాడు. ఈ నేపథ్యంలో గురువారం (జూన్ 6) రోజున రామానాయుడు పుట్టిన రోజు సందర్బంగా నాగ చైతన్య చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముంది? వివరాల్లోకి వస్తే..

రియల్ మామతో రీల్ అల్లుడిగా

రియల్ మామతో రీల్ అల్లుడిగా

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్‌దే. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వరుణ్ తేజ్ లాంటి నేటితరం స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. అంటే రియల్ మామతో రీల్ అల్లుడు పండించే కామెడీ ప్రేక్షకులు చుడనున్నారన్నమాట.

రామానాయుడు స్టూడియోస్ బ్యానర్‌పై పలు బ్లాక్‌బస్టర్స్

రామానాయుడు స్టూడియోస్ బ్యానర్‌పై ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు రూపొందించిన రామానాయుడు గారికి తన కొడుకు, మనవడిని ఒకే తెరపై చూడాలనే బలమైన కోరిక ఉండేదట. ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని ఈ విషయాన్ని బయటపెడుతూ తాత రామానాయుడు జయంతి సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశాడు అక్కినేని నాగచైతన్య.

'వెంకీ మామ' మీకే అంకితం

'వెంకీ మామ' మీకే అంకితం

మీరు కోరుకునట్లుగా ప్రస్తుతం మీ కొడుకు, మనవడు ఒకే తెరపై కనిపించబోతున్నారు. కానీ మీ కల నిజమయ్యే ఈ సమయానికి మీరు మా మధ్య లేకపోవడం బాధగా ఉంది అని రామానాయుడు తనయుడు దగ్గుబాటి సురేష్ బాబు పేర్కొన్న ఓ పోస్టర్ పోస్ట్ చేశాడు నాగచైతన్య. దీనిపై 'వెంకీ మామ' మీకే అంకితం అని ట్యాగ్ చేయడం విశేషం. అయితే దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీల మధ్య ఇంత అటాచ్‌మెంట్ చూసి ఖుషీ అవుతున్నాయి ఇరు ఫ్యామిలీల అభిమాన వర్గాలు.

వెంకీ మామ మూవీ

వెంకీ మామ మూవీ

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్త సమర్పణలో 'వెంకీ మామ' తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X