హీరోయిన్‌పై నాగ చైతన్య ఊహించని కామెంట్స్: ఆ విషయంలో నాకంటే తనే బెస్ట్.. ఇప్పుడూ వెంటాడుతోంది అంటూ!

టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన శైలి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రత్యేకమైన స్టార్‌డమ్ దూసుకుపోతోన్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మధ్యలో వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. ఆ మధ్య వరుస హిట్లు కొట్టినా.. గత ఏడాది చైతూ 'థ్యాంక్యూ', 'లాల్ సింగ్ చడ్డా' వంటి పరాజయాలను చవి చూశాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు 'కస్టడీ' అనే చిత్రంతో వస్తున్నాడు. తాజాగా జరిగిన ఈ మూవీ ఈవెంట్‌లో అతడేం మాట్లాడాడో చూడండి!

'కస్టడీ' అంటూ వస్తున్నాడు: అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రమే 'కస్టడీ'. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని ఇచ్చారు.

Naga Chaitanya

అంగరంగ వైభవంగా ఈవెంట్: క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'కస్టడీ' మూవీని సంక్రాంతి కానుకగా మే 12న విడుదల చేయబోతున్నారు. దీనికి సమయం ఆసన్నం కావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు అక్కినేని ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చారు.

Naga Chaitanya

ఫ్యాన్స్‌పై నాగ చైనత్య ప్రేమ: 'కస్టడీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందే నాగ చైతన్య ఫ్యాన్స్‌తో కలిసి ఫొటోషూట్లు చేసుకున్నాడు. ఇక, ఈవెంట్‌లో మాట్లాడుతూ.. 'నాకు ఇంకా గుర్తుంది. జోష్ ఆడియో లాంచ్‌లో విక్టరీ వెంకీ మామ.. సౌండ్ అంటే ఇలా ఉంటది అని మీ గురించి చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా తగ్గలేదు. ప్రతి ఈవెంట్‌కు అదే ఎనర్జీ. నేను ప్రతిసారి ఇదే కోరుకుంటా' అన్నాడు.

కథ వినగానే హగ్ చేసుకున్నా: చైతూ కొనసాగిస్తూ.. 'ఈ కథ విన్న వెంటనే డైరెక్టర్ వెంకట్ ప్రభును గట్టిగా హగ్ చేసుకున్నా. సినిమా కంప్లీట్ అయ్యాక ఎడిటింగ్ రూమ్‌లో చూసినపుడు కూడా అదే ఫీలింగ్ ఇచ్చింది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే దీని గురించి మాట్లాడుతున్నా. ఆయన తమిళంలో చాలా మంది స్టార్లతో సినిమాలు తీశారు. ఇప్పుడు ఈ సినిమాతో ఏపీ, తెలంగాణను ఎంటర్‌టైన్ చేస్తారు' అని చెప్పాడు.

Naga Chaitanya

ఆయన ఓకే చెప్పగానే ఖుషీ: తర్వాత చైతన్య మాట్లాడుతూ.. 'ఇందులో విలన్‌గా నటించిన అరవింద్ స్వామి గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన కథ విని ఓకే చెప్పారని తెలియగానే మా టీమ్ అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే, మరో ముఖ్యమైన పాత్రను చేసిన శరత్ కుమార్ గారు బాగా సపోర్ట్ చేశారు. ప్రియమణితో ఎక్కువ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోలేదు. ఆమె ఈ క్యారెక్టర్‌ను బాగా ఎలివేట్ చేశారు' అన్నాడు.

ఇప్పుడూ వెంటాడుతోందని: చైతన్య కటిన్యూ చేస్తూ.. 'ఈ సినిమాకు డైలాగ్స్ రాసిన రైటర్ అబ్బూరి రవి గారు పంచ్ డైలాగ్స్ పవర్ ఏంటో థియేటర్లలో తెలుస్తుంది. అలాగే ఇళయ రాజా, యువన్ శంకర్ రాజా ఈ తండ్రీ కొడుకుల మ్యూజిక్ అదిరింది. బీజీఎం వింటే థియేటర్లలో రచ్చే. స్పెషల్‌గా ట్రైలర్‌లో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నిద్రపోతున్నా, నిద్రలేచినా వెంటాడుతోంది' అని తెలిపాడు.

Naga Chaitanya

కృతి శెట్టి నాకంటే బెటర్‌గా: ఈ వేడుకలో కృతి శెట్టి గురించి చైతూ మాట్లాడుతూ.. 'కృతి.. నీ ప్రోగ్రెస్ చూస్తుంటే నాకు సంతోషంగా ఉంటుంది. తను నా కంటే తెలుగు, తమిళం బాగా మాట్లాడుతోంది. ఇండస్ట్రీకి వచ్చి మూడేళ్లు కూడా కాలేదు. కానీ, నీ కెరీర్ ఎలా ఎదుగుతుందో చూస్తే సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి నీ కెరీర్ బ్లాస్ట్ అయిపోతుంది' అని పేర్కొన్నాడు. చివర్లో ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్లు, నటీనటులకు నాగ చైతన్య ధన్యవాదాలు చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X