Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బెజవాడ రౌడీ ల గ్యాంగ్ లో యాక్షన్ హీరోగా నాగ్ చైతన్య ...
'ఏ మాయ చేసావే' సినిమాతో క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని, లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నాగ చైతన్య త్వరలో మాస్ హీరోగా కూడా ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కామాక్షి మూవీస్ బ్యానర్ పై శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం తనకీ ఇమేజ్ ని తెస్తుందని చైతన్య ఆశిస్తున్నాడు. అజయ్ భూయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ కధానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులోని పలు లోకేషన్లలో జరుగుతోంది. ఇంతవరకు జరిగిన షూటింగులో కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. ఇప్పుడు నాగ చైతన్య, కాజల్ లపై ఓ పాటను చిత్రీకరించే సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా చైతన్యకు యాక్షన్ హీరోగా పేరు తెస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. దీనికింకా టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు.
ఇదిలా వుండగా, మరోపక్క సుకుమార్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న 'ఐ లవ్ యూ' చిత్రం లో నాగ చైతన్య మరో భిన్న పాత్రను పోషిస్తున్నాడు. తర్వాత నాగార్జున , రాంగోపాల్ వర్మ కలయికలో వచ్చిన 'శివ' ఓ ట్రెండ్ సెట్టర్ ఫిలింగా చరిత్రలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, నాగార్జున తనయుడు నాగచైతన్యతో ఓ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'బెజవాడ రౌడీలు' పేరుతొ వర్మ తెర కెక్కించనున్న చిత్రంలో చైతన్య కధానాయకుడిగా నటిస్తారని సమాచారం.ఈ మేరకు కధ విన్న నాగ్ ఈ కాంబినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. సో ఇక 'శివ' నాగార్జున కెరీర్ లో ఎలా మైలురాయిగా నిలిచిందో 'బెజవాడ రౌడీలు' కూడా నాగచైతన్య కెరీర్ లో అలాంటి మెమరబుల్ చిత్రంగా నిలుస్తుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.