టాలీవుడ్ హాట్ కపుల్ చై-సామ్.. పిల్లల గురించి ఇదీ నాగచైతన్య రియాక్షన్
టాలీవుడ్ చిత్రసీమలో మోస్ట్ పాపులర్ జంటగా పేరు తెచ్చుకున్నారు నాగ చైతన్య- సమంత. పెళ్ళికి ముందే స్టార్ స్టేటస్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ఇద్దరూ పెళ్లి తర్వాత మరింతగా అట్రాక్ట్ చేస్తూ వస్తున్నారు. హాలిడే ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూనే వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ ఇద్దరిలో ఎవ్వరు కనిపించినా ఒక్కటే మాట అడుగుతున్నారు జనం. అదే పిల్లల సంగతేంటని? తాజాగా ఈ విషయమై నాగ చైతన్య స్పందించాడు.

ముచ్చటైన జంట.. మరి పిల్లలు
నాగ చైతన్య- సమంత ముచ్చటైన జంట అని టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులంతా చెప్పుకుంటారు. సోషల్ మీడియాలో ఈ జోడీ ఫోటోలు చూసి తెగ మురిసిపోతుంటారు అక్కినేని అభిమానులు. అయితే ఈ జంట విషయంలో అందరిలోనూ ఒక్కటే ప్రశ్న. మీరు పిల్లలని ఎప్పుడు కంటారని. తాజాగా దీనిపై నాగ చైతన్య క్లారిటీ ఇచ్చాడు.

త్వరలోనే ఆలోచిస్తాం..
ప్రస్తుతం తన జీవితం ఎంతో హాయిగా, బ్యూటీఫుల్‌గా ఉందని అన్నాడు నాగ చైతన్య. దేవుడు ఇప్పటివరకు తనకిచ్చిన వాటితో తృప్తిగా ఉందని, ఇంతకుమించి ఇంకేమీ ఆ దేవుణ్ణి అడగలేనని అన్నాడు. అయితే త్వరలోనే పిల్లల గురించి కూడా ఆలోచిస్తామని నాగ చైతన్య పేర్కొనడం విశేషం.

గతంలో సమంత ఏం చెప్పిందంటే..
నిజానికి చై-సామ్ పిల్లల గురించి గత కొన్ని నెలలుగా ఓ రేంజ్‌లో చర్చలు నడుస్తున్నాయి. కొందరైతే ఏకంగా సమంత ప్రెగ్నెంట్ అని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయమై స్పందించిన సమంత.. పిల్లల విషయంలో తాను, చైతూ ఒక తేదీ అనుకున్నామని, అయితే అది బయటకు చెప్పనని తెలిపింది. పిల్లలు పుడితే వాళ్ళే సర్వస్వం అనుకుంటానే తప్ప వేరే పనులు పెట్టుకొనని చెప్పింది.

వెండితెరపై చై- సామ్ జోడీ
పెళ్ళికి ముందే వెండితెరపై చై- సామ్ జోడీ అలరించింది. అయితే పెళ్లి తర్వాత మొదటిసారి మజిలీ సినిమా జోడీ కట్టిన ఈ జంట భారీ సక్సెస్ సాధించింది. రియల్ లైఫ్ జోడీ రీల్ లైఫ్ జోడీగా ప్రేక్షకులను కట్టి పడేశారు. ఈ సినిమా అందించిన విజయం చై- సామ్ సినీ జర్నీకి మరింత పుషింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం సమంత, నాగ చైతన్య
ప్రస్తుతం సమంత 96 రీమేక్ లో శర్వానంద్ సరసన నటిస్తోంది. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోందని టాక్. ఇక నాగ చైతన్య 'వెంకీ మామ' సినిమాలో, అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











