1000 సార్లు ఆలోచించా.. సమంతతో విడాకులపై నాగచైతన్య ఎమోషనల్

అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున నటవారసుడు గా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు.వరుస విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజా 'తండేల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. దీంతో తండేల్ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకున్నట్లు మూవీ వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ హీరోయిన్ సమంతతో ప్రేమ, పెళ్లి , విడాకులుపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఏం మాయ చేశావే, మజిలి, ఆటో నగర్ సూర్య, మనంలో కలిసి నటించారు. ఈ సినిమాలతో ఈ జంటకు మంచి పాపులారిటీ వచ్చింది. అయితే 'ఏం మాయ చేశావే' సినిమా సమయంలోనే నాగ చైతన్య, సమంత లు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట, పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆ సమయంలో ఈ జంటకు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. అసలేం జరిగిందో తెలియదు. కానీ, సరిగ్గా నాలుగేళ్ల తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు.

Naga Chaitanya Reacts On divorcing Samantha Ruth Prabhu in Thandel Movie Promotions

విడాకుల అనంతరం సమంత టాలీవుడ్ కు దూరం కావడం, మమోసైటిస్ అనే వ్యాధి బారిన పడటం, ఏడాది పాటు సినిమాలకు దూరం కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తరువాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ సామ్ బిజీబిజీగా మారిపోయింది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే.. సమంత నుంచి విడాకులిచ్చిన కొద్ది రోజులకే నాగచైతన్య, శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డారు. ఈ జంటపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశారు. వాటన్నింటికి చెక్ పెడుతూ నాగ చైతన్య, శోభితా లు గతేడాది డిసెంబర్ 4 న వివాహం బంధంతో ఒక్కటయ్యారు. కొద్ది మంది అతిథుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుక అట్టహాసంగా ముగిసింది. వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.

ఇదెలా ఉంటే.. తండేల్ మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో నాగచైతన్య ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ' ఏ వ్యక్తి జీవితంలోనైనా బ్రేకప్ జరుగుతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆ భాదేంటో నాకు తెలుసు. నేను కూడా బ్రేకప్ నుండే వచ్చాను. మేము ఏమి ఓవర్ నైట్ లో నిర్ణయం తీసుకోలేదు. అలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించా .. మేమిద్దరం ఒకరికొకరం అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారిలో వారు కొనసాగుతున్నాం.. ఎవరి జీవితాలు సక్సెస్ ఫుల్ గా గడిపేస్తున్నాం. అసలు ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు కానీ వచ్చింది. జీవితంలో ఏం జరిగినా దానికి ఓ కారణం ఉంటుంది కదా' అంటూ తన మాజీ భార్య సమంత తో జరిగిన బ్రేకప్ గురించి వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X