‘ఓ బేబీ’సక్సెస్ వెనుక నాగ చైతన్య.. అతడి వల్లే అంత అందంగా వచ్చిందట

Recommended Video

The Key Reason Behind Oh Baby Success. Who's He? || Filmibeat Telugu

అక్కినేని సమంత - నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఓ బేబి'. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైనా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సమంతతో పాటు, సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, సునయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అన్నింటికి తోడు రీమేక్ సినిమా అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తెరకెక్కించడంలో డైరెక్టర్ నందినీ రెడ్డి సక్సెస్ అయ్యారు. అలాగే, పలు విభాగాలు చక్కగా పని చేశాయన్న పేరు వచ్చింది.

సినిమాటోగ్రఫీ హైలైట్

సినిమాటోగ్రఫీ హైలైట్

‘ఓ బేబి' విషయంలో అందరూ చెప్పుకుంటున్నది సినిమాటోగ్రఫీ గురించే. రిచర్డ్ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫి ఈ సినిమాకు హైలైట్ అని చెప్పాలి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు అన్ని ఫ్రేమ్స్ ఎంతో అందంగా కనిపించడం వెనుక కెమెరామెన్ పనితనం కనిపించింది. అందుకే ఈ స్థాయిలో అతడికి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో అంతా ఈ కెమెరామెన్ గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.

నాగ చైతన్యే కారణం

నాగ చైతన్యే కారణం

‘ఓ బేబి'కి రిచర్డ్ ప్రసాద్ పని చేయడం వెనుక అక్కినేని నాగ చైతన్య పాత్ర ఉందని తెలుస్తోంది. గతంలో ‘దోచెయ్' అనే సినిమాతో తనతో పని చేసిన రిచర్డ్ పనితనం గురించి చైతూకు బాగా తెలుసు. అందుకే ఈ సినిమాకు ఆయనను రికమెండ్ చేశాడట ఈ అక్కినేని వారబ్బాయి. తన భార్య లీడ్ రోల్ పోషిస్తుండడంతో చైతూ.. రిచర్డ్‌ను డైరెక్టర్ నందనీ రెడ్డికి పరిచయం చేశాడని అంటున్నారు.

నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు

నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు

నాగ చైతన్య మాట ప్రకారం రిచర్డ్‌ను తన సినిమాలోకి తీసుకున్నారు నందినీ రెడ్డి. అతడి నమ్మకాన్ని ఈ యంగ్ సినిమాటోగ్రఫర్ వమ్ము చేయలేదు. ఎంతో బాధ్యతగా వ్యవహరించి ప్రతీ సీన్‌ను ఎంతో రిచ్‌గా చూపించాడు. కలర్స్ మిక్సింగ్‌లోనూ తన ప్రతిభను కనభరిచాడు. దీంతో రిచర్డ్ పనితీరు పట్ల రికమెండ్ చేసిన చైతూ.. అటు డైరెక్ట్ చేసిన నందినీ రెడ్డి ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు.

గతంలో పని చేసిన సినిమాలు

గతంలో పని చేసిన సినిమాలు

తమిళనాడుకు చెందిన రిచర్డ్ ప్రసాద్ ఇప్పటి వరకు యాభై పైగా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ పలు చిత్రాలకు పని చేశాడు. చైతూ ‘దోచెయ్'తో పాటు ముఖ్యంగా యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో భారీ హిట్ చిత్రం ‘స్వామి రారా', అల్లు శిరీష్ ‘కొత్త జంట', విక్టరీ వెంకటేష్ ‘బాబు బంగారం' సహా పలు చిత్రాలకు తన పనితనం చూపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X