నాగచైతన్య 'ఆటో నగర్ సూర్య' చిత్రంలో ఆమెనే పైనల్ చేసారు
నాగచైతన్య , దేవకట్టా కాంబినేషన్ లో రూపొందనున్న ఆటో నగర్ సూర్య చిత్రానికి హీరోయిన్ ఎంపిక జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అతని సరసన రాకుల్ ప్రీతీ సింగ్ అనే అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేసారని సమాచారం.రాకుల్ ప్రీతి సింగ్ మిస్ ఇండియా కంటెస్ట్ లో ఫైనల్ కి చేరినామె. అలాగే ఆమె ఇప్పటికే ప్రబాస్ కజిన్ సిద్దార్ధ రాజ్ కుమార్ సరసన కెరటం చిత్రంలో చేస్తోంది.
ఇక ఈ చిత్రానికి మొదట హీరోయిన్ గా సమంత, కాజల్, అమృతారావు,నిత్యామీనన్ వంటి పేర్లు వినిపించినప్పటికీ ఆమెనే ఫైనలైజ్ చేసారు. ఈ చిత్రం బెజవాడ నేఫధ్యంలో జరిగుతుందని ఓ మాస్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రూపొందించనున్నారని వినికిడి. ఇప్పటికే ఆటో నగర్ సూర్యగా దేవకట్టా విడుదల చేసిన ఆడియో టీజర్ అందరనీ ఆకట్టుకుంది. ఈ చిత్రం వచ్చే నెల నుంచి షూటింగ్ కి వెళ్ళనుంది. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications











