నాగచైతన్య '100% లవ్' ఆడియో రిలీజ్ విశేషాలు
నాగాచైతన్య, తమన్నా కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ రూపొందిస్తున్న '100% లవ్'చిత్రం ఆడియో నిన్న(సోమవారం)రాత్రి హైదరాబాద్ లో విడుదలైంది.తొలి సీడీని నాగార్జున ఆవిష్కరించారు. రామ్ చేతుల మీదుగా అల్లు అర్జున్ ఆ సీడీని అందుకొన్నారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ ''నాగచైతన్య చేస్తున్న మూడో చిత్రమిది. తన మూడో సినిమాకే సుకుమార్ లాంటి దర్శకుడి చేతిలోపడటం, అదీ గీతా ఆర్ట్స్ సంస్థలో చేయటం ఆనందంగా ఉంది. ఈ సినిమాని నేనింకా చూడలేదు. అరవింద్ ఫోన్ చేసి నాగచైతన్య చాలా బాగున్నాడని చెప్పారు. తప్పకుండా చూస్తాను. దేవిశ్రీప్రసాద్ చక్కటి సంగీతం అందించాడు. ఇందులో డియాలో డియాలో పాట నాకు బాగా ఇష్టమైనది'' అన్నారు.సుకుమార్ మాట్లాడుతూ ''మామూలుగా ఒకరికొకరు ప్రేమించాం అని చెబుతుంటారు. నేను మాత్రం నాగచైతన్య, తమన్నా ఇద్దరినీ కలిపి ప్రేమించాను. తెరపై వాళ్లు చాలా బాగా కనిపిస్తారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం కోసం ఒక దెయ్యంలా కష్టపడతాడు. తను మరోసారి చక్కటి సంగీతం అందించాడన్నారు.సుకుమార్‌తో పనిచేయడం ఒక కొత్త అనుభూతినిస్తుంది. ప్రతి సన్నివేశాన్ని విడమర్చి చెబుతారు. అందుకే పాటలు ఇంత చక్కగా కుదురుతున్నాయి. ఇందులో స్వాతితో ఒక పాట పాడించానన్నారు దేవిశ్రీ. ఈ కార్యక్రమంలో డి.రామానాయుడు, నాగబాబు, సురేష్‌బాబు, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్ కుమార్‌చౌదరి, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, ఠాగూర్ మధు తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి.


Click it and Unblock the Notifications











