స్విట్జర్లాండ్‌లో నాగచైతన్య బెజవాడ
నాగ చైతన్య హీరోగా నటిస్తున్న 'బెజవాడ" సినిమా సెప్టెంబర్ 12 నుంచి స్విట్జర్ లాండ్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా రామోజీఫిల్మ్ సిటీలో, హైదరాబాద్, విజయవాడల్లో పలు ఛేజింగ్, ఫైట్ సీన్లను చిత్రీకరించారు. స్విట్జర్లాండ్ లో జరిగే షెడ్యూల్ లో నాగచైతన్య-అమలపౌల్ పై పాటల చిత్రీకరణ జరుగనుంది. ఇందుకోసం పలు అద్భుతమైన లొకేషన్లను ఎంపిక చేశారు.
బెజవాడ చిత్రం ద్వారా వర్మ శిష్యుడు వివేక్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాష్ట్రంలో ఒకప్పడు రౌడీయిజానికి మారు పేరుగా పిలవబడ్డ బెజవాడలోని కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కిరణ్ కుమార్ కోనేరు, రాంగోపాల్ వర్మ సంయుక్తంగా శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి నాటికి ఈ సినిమా వెండి తెరపై సందరడి చేయనుంది.


Click it and Unblock the Notifications











