twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బెజవాడ’ మళ్లీ వాయిదా

    By Bojja Kumar
    |

    నాగ చైతన్య, అమల పాల్ జంటగా రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సినిమా 'బెజవాడ" విడుదల మళ్లీ వాయిదా పడింది. వర్మ శిష్యుడు వివేక్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 25న లేదా డిసెంబర్ 26న విడుదల చేయాలని తొలుత భావించినా...ఆ తేదీ రోజున విడుదల సాధ్యం కాక పోవడం, ఇతర సమస్యల కారణంగా సినిమాను డిసెంబర్ 1న విడుదల చేయాలని నిర్ణయించారు.

    వివాదాస్పద దర్శకుడిగా పేరొందిన వర్మ...బెజవాడకు సంబంధించిన వివాదాస్పద అంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. 90వ దశకంలో ఇక్కడ జరిగిన కుల, వర్గ పోరాటాలు, పేరుమోసిన రౌడీల జీవితాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా కథ తయారు చేశాడని అంటున్నారు. అయితే వర్మ మాత్రం ఇదంతా కల్పిత కథ మాత్రమే, ఈ సినిమా ఎవరినీ ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు.

    ఈ సినిమాలో నాగచైతన్య, అమల పాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుభలేఖ సుధాకర్, ఆహుతి ప్రసాద్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

    English summary
    Naga Chaitanya’s forthcoming film Bejawada is now scheduled for a release on December 1. Earlier, it was supposed to release on either 25th or 26th November but the filmmakers had postponed it to 1st December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X