నాగ చైతన్య ‘బెజవాడ’ ప్యాకప్

By Bojja Kumar

నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న సినిమా 'బెజవాడ". ఈ సినిమాలో చైతు సరసన అమలపాల్ నటిస్తుండగా, రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వివేక్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు సంయుక్తంగా శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ వర్క్ లోకి ఎంటరైంది. నవంబర్ 3న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా తొలి నుంచి వివాదాల చుట్టూ తిరుగుతుంది. తొలుత ఈ సిసిమా పేరు బెజవాడ రౌడీలు అని పెట్టగా...విజయవాడ స్థానికుల ఆందోళన మేరకు సినిమా టైటిల్ నుంచి రౌడీలు అనే పదాన్ని తొలగించారు. నాగచైతన్య ఇందులో పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నారు. రౌడీయిజం, రాజకీయాలను బేస్ చేసుకుని ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఇంకా కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రపసాద్, సుభలేక సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. విజయవాడలో గతంలో రాజ్యమేలిన రౌడీ రాజకీయాలను, హింసను బేస్ చేసుకుని ఈ సినిమా రూపొందుతోందని ప్రచారం జరుగడంతో సర్వత్రా 'బెజవాడ" పై ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X