twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ చైతన్య ‘బెజవాడ’ విడుదల వాయిదా

    By Bojja Kumar
    |

    నాగ చైనత్య, అమల పౌల్ జంటగా నటిస్తున్న ' బెజవాడ" సినిమా అక్టోబర్ 21న విడుదల కానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బెజవాడ సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం సినిమాను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తూంది. ముందుగా అనుకున్న తేదీన విడుదల సాధ్యం కాదనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం బెజవాడ షూటింగ్ స్విట్జర్‌లాండ్ లో జరుగుతోంది. ఇక్కడ కొన్ని అద్భుతమైన లోకేషన్‌లలో నాగచైతన్య, అమల‌పౌల్‌లపై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ భాగం షూటింగ్ విజయవాడ, హైదరాబాద్‌లలో జరిగింది. ఈ సినిమా ద్వారా వివేక్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంగోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    బెజవాడ రౌడీయిజం ప్రధాన అంశంగా రూపొందిన ఈ సినిమాకు తొలుత 'బెజవాడ రౌడీలు" అనే టైటిల్ పెట్టినప్పటికీ, బెజవాడ వాసుల ఆందోళనతో టైటిల్ నుంచి రౌడీలు అనే పదాన్ని తొలగించి 'బెజవాడ"గా మార్పు చేశారు.

    English summary
    Naga Chaitanya starrer Bejawada that was supposed to hit the screens on October 21st for Diwali is likely to be postponed to November 1st week as per the sources buzz.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X