నాగచైతన్య తాజా చిత్రం బెజవాడను నవంబర్ మూడవ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ 21 న దీపావళికి విడుదల చేద్దామనుకుంటున్నారు. కాని ఈ చిత్రం షూటింగ్ లో అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగకపోవటం,అలాగే కొన్ని సీన్స్ రీషూట్ చేయాలనుకోవటమే కారణం అని తెలుస్తోంది.అలాగే నాగచైతన్య గత చిత్రం దడ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో వర్మకు నాగార్జున ఈ సినిమాని జాగ్రత్తగా చేసి హిట్ కొట్టి తన కొడుకుని యాక్షన్ హీరోగా నిలబెట్టాల్సిన భాధ్యత నీదేనని హెచ్చరించాడట. దాంతో వర్మ ఇప్పుడు పూర్తిగా బెజవాడ పైనే దృష్టి పెట్టి మొత్తం రషెష్ చూసి చాలా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. తను అనుకున్న ఇంటెన్సిటీ కథలో రాలేదని వర్మ దర్శకుడు వివేక్ కృష్ణ పై సీరియస్ అయినట్లు ఫిల్మ్ సర్కిల్సో వినపడుతోంది. దాంతో తానే కొన్ని సీన్స్ రీషూట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. దాంతో అక్టోబర్ 21 న దీపావళికి విడుదల చేద్దామనుకుంటున్న బెజవాడ నవంబర్ మూడవ తేదీకి వాయిదా పడినట్లు సమాచారం. ''దుర్మార్గులను అంతం చేయాడానికి ఒక్కోసారి దుర్మార్గుడిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. తను పుట్టి పెరిగిన 'బెజవాడ' జోలికొస్తే ఎంతటివారినైనా ఎదిరించేందుకు సిద్ధమైన యువకుడి కథ 'బెజవాడ'. ఆ యువకుడుగా నాగచైతన్య కనిపిస్తారు.అలాగే ఎవరైనా సరే పుడుతూనే కత్తి పట్టుకొని పగతో రగిలిపోరు. పరిస్థితులే వాళ్లలో కక్షల్నీ, కార్పణ్యాల్నీ పెంచుతాయి. మా కథలోని యువకుడు ఏ కారణాలతో రౌడీగా మారాల్సి వచ్చింది. అతని లక్ష్యం ఏమిటి అన్నది తెర మీదే చూడాలి నాగచైతన్య నటన తప్పకుండా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు దర్శకుడు వివేక్‌కృష్ణ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెజవాడ'. నాగచైతన్య, అమలాపాల్ జంటగా నటిస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు నిర్మాతలు.