నేను వరసలో చేయబోయే సినిమాల లిస్టు ఇదే: నాగచైతన్య
నాగచైతన్య-తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో గీతాఆర్ట్‌స పతాకంపై బన్నీవాసు నిర్మించిన '100% లవ్"హిట్ అయిన సందర్భంగా హీరో నాగచైతన్య అన్నపూర్ణ స్టూడియోలో మీడియాతో మాట్లాడాడు. 'ఏమాయచేశావె" తర్వాత మరో విజయం అందుకోవడం ఆనందా న్నిచ్చిందని చెబుతూనే... తన తాజా ప్రాజెక్టుల గురించి వివరించారు. ''కామాక్షి కళామూవీస్ పతాకంపై డి.శివప్రసాదరెడ్డి నిర్మా తగా...ఓ మాస్‌మసాలా యాక్షన్ చిత్రం ప్రస్తుతం చిత్రీ కరణలో ఉంది. మరో 20రో జుల్లో షూటింగ్ పూర్తవుతుంది. కాజల్ ఈ చిత్రంలో కథానాయిక.
త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం. ఈ సినిమాలో నన్ను ఇంతవరకూ చూడని కొత్త కోణంలో చూస్తారు. డాన్సులు, ఫైట్లలో నేనేంటో నిరూపించుకోబోతున్నాను. మరో రెండు సినిమాలు..'బెజవాడ రౌడీలు", 'ఆటోనగర్ సూర్య" ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుపుకుం టున్నాయి. 'బెజవాడ రౌడీలు" చిత్రానికి రచయిత వివేక్ దర్శకత్వం వహిస్తారు. రామ్‌గోపాల్ వర్మ నిర్మిస్తారు. 'ప్రస్థానం" వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని అందించిన దేవకట్టా 'ఆటోనగర్ సూర్య" చిత్రా నికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది"" అంటూ తన ఇతర ప్రోజెక్టుల వివరాలు అందించారు నాగచైతన్య.


Click it and Unblock the Notifications











