నాగ చైతన్య కొత్త చిత్రం 'దుర్గ' (లాంచ్ ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్ : నాగచైతన్య,హన్సిక జంటగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న 'దుర్గ' చిత్రం గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. శ్రీ శుభ శ్వేత ఫిలింస్ పతాకంపై సి.కళ్యాణ్ సమర్ఫణలో రూపొందనున్న ఈ చిత్రంలో ఆయన పిల్లలు వరుణ్-శ్వేతలాన నిర్మాతలుగా పరిచయమవుతున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేసాన్ని చిత్రీకరించారు.

డా.డి రామానాయుడు క్లాప్ ఇవ్వగా కె.రఘు రామ కృష్ణరాజు కెమెరా స్విఛ్ఛాన్ చేశారు. వివి వినాయిక్ గౌరవ దర్శకత్వం వహించారు. కె.ఎస్ రామారావు,అల్లు అరవింద్,అలంకార్ ప్రసాద్,అమ్మిరాజు, అశోక్ కుమార్ తదితరులతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

సి.కళ్యాణ్ మాట్లాడుతూ...చాలాకాలం తర్వాత నేను చేస్తున్న స్ట్రెయిట్ చిత్రమది. దీంతో మా పిల్లలు నిర్మాతలుగా పరిచయమవుతున్నారు. ఆకుల శివ చక్కని కథ అందించారు. వినోదభరితంగా సాగే మాస్ సినిమా ఇది. నాగార్జున కెరీర్ లో శివ చిత్రం ఎలా నిలిచిపోయిందో,చైతూకి ఈ చిత్రం అదే స్దాయిలో గుర్తింపు తెస్తుంది. తమన్ సంగీత సారధ్యంలో 5 పాటలు ఉన్నాయి. ఈ నెల 24 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. జులై నెలకి పూర్తి చేసి రంజాన్ సమయంలో విడుదల చేస్తాం అని తెలిపారు.

శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ... ఆకుల శివ అందించిన కథపై 5 నెలలు వర్క్ చేశాం. దూకుడు,ఢీ,రెడీ తరహాలో వినోదభరితంగా సాగుతుంది. రెండున్నర గంటలపాటు కుటుంబం మొత్తం చూసి కడుపుబ్బం నవ్వుకునే చిత్రమిది. నాగ చైతన్యకి కొత్త తరహా చిత్రమవుతుంది. హన్సిక గ్లామర్ తో పాటు ఫెరఫార్మెన్స్ కి స్కోపున్న పాత్ర చేస్తోంది.

పవర్ ఫుల్

పవర్ ఫుల్

దుర్గ అనే టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో అందరూ దీని గురించే మాట్లాడుకోవటం కనిపించింది. ఓ ప్రక్కన కామెడీ అని చెప్తూ..ఈ టైటిల్ పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఫ్యామిలీ కథనా...

ఫ్యామిలీ కథనా...

నాయక్,లక్ష్మి వంటి విభిన్నమైన ప్రేమ కథలు అందించిన ఆకుల శివ కథ కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు మొదలయ్యాయి.

హన్సిక టైమ్

హన్సిక టైమ్


మొన్న విడుదలైన పాండవులు పాండవులు తుమ్మెద చాలా కాలం తర్వాత హన్సికకు బ్రేక్ ఇచ్చింది. హన్సిక వరసగా సినిమాలు కమిటవుతోంది.నాగ చైతన్య వంటి యంగ్ హీరో సరసన ఆమె చేస్తూండటంతో ఆమె హ్యాపీగా ఉంది.

హన్సిక టైమ్

హన్సిక టైమ్


మొన్న విడుదలైన పాండవులు పాండవులు తుమ్మెద చాలా కాలం తర్వాత హన్సికకు బ్రేక్ ఇచ్చింది. హన్సిక వరసగా సినిమాలు కమిటవుతోంది.నాగ చైతన్య వంటి యంగ్ హీరో సరసన ఆమె చేస్తూండటంతో ఆమె హ్యాపీగా ఉంది.

వినాయిక్ చేతుల మీదుగా...

వినాయిక్ చేతుల మీదుగా...

వినాయిక్ వంటి స్టార్ డైరక్టర్ దీనికి గౌరవ దర్శకత్వం వహించారు. విజయవంతమైన చిత్రాలు ఎన్నో డైరక్ట్ చేసిన వినాయిక్ ది గోల్డెన్ హ్యాండ్ కావటంతో పిలిచారు.

హిట్ పెయిర్...

హిట్ పెయిర్...


తొలిసారిగా నాగచైతన్య, హన్సిక కాంబినేషన్ ఇది. ఇది హిట్ పెయిర్ అవుతుందని,ఇంకా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు వస్తాయని అంటున్నారు.

నాగచైతన్య హుషారుగా...

నాగచైతన్య హుషారుగా...

తన తండ్రికి ఢమురకంతో హిట్టిచ్చిన దర్శకుడు శ్రీనివాస రెడ్డి దర్శకత్వం కావటంతో నాగచైతన్య హుషారుగా ఉన్నారు. హిట్ కొడతానన్న థీమా కనపడుతోంది.

రామానాయుడు...

రామానాయుడు...


తన తాత డా.డి రామానాయుడు క్లాప్ ఇవ్వగా కె.రఘు రామ కృష్ణరాజు కెమెరా స్విఛ్ఛాన్ చేశారు. పెద్దల ఆశీస్సులతో సినిమా ప్రారంభమైంది.

క్లాప్ కొట్టి...

క్లాప్ కొట్టి...

రామానాయుడుకి తన మనవుడు నాగచైతన్య అంటే మొదటి నుంచి చాలా ఇష్టం. అతనితో ఓ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. క్లాఫ్ కొట్టి ఆశ్వీరదించారు.

ఎవరెవరు

ఎవరెవరు

ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, కె యస్ రామారావు, అమ్మిరాజు, అశోక్ కుమార్, అలంకార్ ప్రసాద్ తదితరులు పాల్గొని యూనిట్ కి శుభాకాంక్షలు తెలియచేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X