టైటిల్ పెట్టకుండానే టీజర్ వదిలారు(వీడియో)

By Srikanya

హైదరాబాద్ ''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ. 'స్వామి రారా'తో ఆకట్టుకొన్న దర్శకుడీయన. ఇప్పుడు నాగచైతన్య హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కృతి సనన్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రై.లి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఆదివారం నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. అయినా టీజర్ వదిలి క్రేజ్ తీసుకు వచ్చే ప్రయత్నం చేసారు.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ-‘ అత్తారింటికి దారేది తర్వాత మా బ్యానర్‌లో స్వామిరారా టెక్నిషియన్స్‌తో చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా విషెస్‌ తెలుపుతూ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మరియు టీజర్‌ను విడుదల చేస్తున్నాం. నాగచైతన్య చాలా డెటికేటెడ్‌ ఆర్టిస్ట్‌. స్టైలిష్‌గా ఉండే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నాగచైతన్య మూవీలో బెస్ట్‌ మూవీ అవుతుంది. ఆడియన్స్‌తో పాటు ఫ్యాన్స్‌కి కూడా బాగా నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పాటలు తప్ప టోటల్‌ టాకీ పార్ట్‌ కంప్లీట్‌ అయింది. పీటర్‌ హెయిన్స్‌ సారధ్యంలో ఒక థ్రిల్లింగ్‌ ఛేజ్‌ జరుగుతోంది'. అన్నారు.

Naga Chaitanya’s new film teaser

ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X