twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫైనల్ గా నాగచైతన్య సీన్ లోకి వచ్చాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : హిట్ ఇవ్వటం ఈజీ అని...అదే హీరోని కథతో ఒప్పించటం అనేది కష్టమని దర్శకులు అంటూంటారు. ఎందుకంటే స్టోరీ లైన్ బాగుంది...కానీ ఇంటర్వెల్ మార్చండని, ఆ తర్వాత క్లైమాక్స్ లో ఇంకా ఏదో కావాలని,సెకండాఫ్ స్పీడుగా లేదని ఇలా ఏదో ఒక మార్పుని రోజు వారి స్క్రిప్టు పట్టుకుని తమ చుట్టూ తిరిగే దర్శకులకు,రచయితలకు హీరోలు చెప్తూ,తమకు నచ్చేటట్లుగా కథని తయారుచేసుకుంటూంటారు. దాంతో హిట్ కొట్టిన దర్శకుల తదుపరి చిత్రాలు సైతం లేటైపోతూంటాయి. మార్కెట్ లో వారి క్రేజ్ తగ్గిపోయేదాకా కొత్త సినిమా మొదలు కాదు.

    చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన 'స్వామి రా రా' దర్శకుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో తదుపరి సినిమా ఇంకా మొదలు కాలేదేంటి అనే సందేహాలు గత కొద్ది నెలలుగా సినీ అభిమానులను కలవరపరుస్తున్నాయి. దానికి తోడు సుధీర్ వర్మ కొన్నాళ్లు ఎన్టీఆర్ తో చేస్తాడని, మరికొంతకాలం రామ్ కి కథ చెప్పాడని, నితిన్ ని ఎప్రోచ్ అయ్యాడని, నాగార్జున తో ప్రాజెక్టు ప్రారంభించేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే నాగచైతన్య మొత్తానికి కథ నచ్చి డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. నాగచైతన్య కోసం గత కొంతకాలంగా అన్నపూర్ణలో కథపై కసరత్తులు చేస్తూ ఒప్పించే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారని సమాచారం.

    'మనం'లో రాధా మోహన్‌గా, నాగార్జునగా రెండు విభిన్న పాత్రలతో అలరించారు నాగచైతన్య. ఇప్పుడు మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'స్వామి రా రా' దర్శకుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్‌ నాయిక. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు.

    Naga Chaitanya’s new movie with ‘Swamy Ra Ra’ director Sudheer Varma

    నాగచైతన్య మాట్లాడుతూ ''స్వామి రా రా' నాకెంతో ఇష్టమైన సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత ఆ చిత్ర దర్శకుడు సుధీర్‌వర్మతో పని చేయాలనుకున్నాను. ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోంది. ప్రస్తుతం నేను చేస్తున్న 'ఒక లైలా కోసం' తర్వాత ఈ సినిమా మొదలవుతుంది'' అన్నారు.

    ''అన్ని వర్గాలను అలరిస్తూ నా తరహాలో సాగే సినిమా ఇది. నాగచైతన్య పాత్ర కొత్తగా ఉంటుంది'' అన్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ ''సుధీర్‌వర్మ చెప్పిన కథ చాలా బాగుంది. నాగచైతన్యను కొత్త తరహాలో చూపించే చిత్రమిది. త్వరలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తామ''అన్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేశ్ ఇప్పటివరకూ ఎంపికైన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నారాయణరెడ్డి.

    English summary
    
 Naga Chaitanya’s new movie with ‘Swamy Ra Ra’ director Sudheer Varma will be started in June with a Pooja ceremony. This will be a romantic entertainer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X