నాగచైతన్య నెక్ట్స్ చిత్రం దర్శకుడు అతనే
నాగచైతన్య తన తదుపరి చిత్రానికి మలినేని గోపీచంద్ ని దర్శకుడుగా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. రవితేజ తో డాన్ శీను చిత్రం తీసి హిట్టు కొట్టిన గోపీచంద్ గత కొంత కాలంగా స్క్రిప్టు వర్క్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా నాగార్జున ని కలిసి కథ వినిపించి, ఆయన కుమారుడుతో చేయటానికి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆర్.ఆర్.మూవి మేకర్స్ వారు ఈ చిత్రం నిర్మించనున్నారు. ఇక నాగచైతన్య ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఐలవ్ యు అనే చిత్రం చేస్తున్నారు. అలాగే అజయ్ భుయాన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ని సైతం చేస్తున్నారు. ఇక ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు...నాగార్జునతో శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఢమురుకం అనే చిత్రం చేస్తున్నారు.
నాగచైతన్య గోపీచంద్ మలినేని అజయ్ భుయాన్ సుకుమార్ తమన్నా naga chaitanya sukumar tamanna nagarjuna allu aravind


Click it and Unblock the Notifications